T20 WC: స్మృతి, షఫాలీ హాఫ్ సెంచరీలు.. నెదర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Jun 17 , 2026 | 08:46 PM
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లీడ్స్ వేదికగా భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లీడ్స్ వేదికగా భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌కు 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్మృతి మంధాన(74; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ(55;38 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు.
జెమీమా రోడ్రిగ్స్(19), యాస్తిక భాటియా(3), హర్మన్‌ప్రీత్ కౌర్(12) విఫలమయ్యారు. రిచా ఘోష్(20*; 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ(10*; 2 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) నాటౌట్‌గా నిలిచారు. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డి లాంగే 2, ఐరిస్ జ్విల్లింగ్, హీథర్ సీగర్స్, వాన్ డెన్ రాడ్ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంక ప్లేయర్‌తో వివాదం.. వైభవ్‌కు బీసీసీఐ షాక్!
ముక్కోణపు సిరీస్: భారత్-ఎ ఘన విజయం.. ఫైనల్ బెర్తు ఖరారు