Share News

ముక్కోణపు సిరీస్: భారత్-ఎ ఘన విజయం.. ఫైనల్ బెర్తు ఖరారు

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:54 PM

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్-ఎపై భారత్-ఎ జట్టు ఘన విజయం సాధించింది. 320 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్-ఎ జట్టు 36.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.

ముక్కోణపు సిరీస్: భారత్-ఎ ఘన విజయం.. ఫైనల్ బెర్తు ఖరారు
India A vs Afghanistan A

ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్-ఎపై భారత్-ఎ జట్టు ఘన విజయం సాధించింది. 320 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్-ఎ జట్టు 36.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. దీంతో అఫ్గాన్‌పై భారత్ 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో మెరుగైన నెట్ రన్ రేట్ (+0.797) సాధించిన టీమిండియా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్-ఎ జట్టు 9 వికెట్లు కోల్పోయి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రియాంశ్ ఆర్య(58), కుమార్ కుషాగ్రా(58), తిలక్ వర్మ(59) హాఫ్ సెంచరీలు చేశారు. వైభవ్ సూర్యవంశీ(38), రుతురాజ్ గైక్వాడ్(30), విప్రాజ్ నిగమ్(30) పర్వాలేదనిపించారు. సూర్యాంశ్(7), అనుకుల్ రాయ్(4), అన్షుల్ కాంబోజ్(0) విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ 2, అబ్దుల్లా 2, ఫర్మానుల్లా 2, జహీర్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.


అనంతరం 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ బ్యాటర్లు తడబడ్డారు. బహిర్ షా(57), ఫైసల్ షినోజాదా(46), ఇమ్రాన్ మిర్(32) రాణించారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్-ఎ బౌలర్లలో నిశాంత్ సింధు 4 వికెట్లతో చెలరేగాడు. యశ్ ఠాకూర్ 2, అన్షుల్ కాంబోజ్, విప్రాజ్ నిగమ్, సూర్యాంశ్, అనుకుల్ రాయ్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

వైభవ్‌కు లైఫ్‌లైన్.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై దుమారం!

ఫిఫా ప్రపంచ కప్: ఆస్ట్రియా చారిత్రక విజయం

Updated Date - Jun 17 , 2026 | 05:59 PM