అఫ్గాన్‌పై సూపర్ సెంచరీ.. ఇషాన్ కిషన్ అరుదైన ఘనత
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:42 PM
లఖ్‌నవూ వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: లఖ్‌నవూ వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా ప్లేయర్లు.. విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 79 బంతుల్లో ఏకంగా 125 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అతడికి ఇది రెండో వన్డే సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో ఇషాన్ తన వన్డే కెరీర్‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఇషాన్ కిషన్ ఈ వెయ్యి పరుగుల మైలురాయిని కేవలం 26 ఇన్నింగ్స్‌లోనే చేరుకున్నాడు. దీంతో భారత్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి వన్డే పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ల జాబితాలో అతడు నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(19 ఇన్నింగ్స్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్(24 ఇన్నింగ్స్) రెండో స్థానంలో, నవ్‌జ్యోత్ సింగ్, శ్రేయస్ అయ్యర్(25 ఇన్నింగ్స్) మూడో స్థానంలో ఉన్నారు.
మరో రికార్డు..
71 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న ఇషాన్ కిషన్.. తన ఖాతాలో మరో రికార్డు కూడా వేసుకున్నాడు. వన్డేల్లో అఫ్గాన్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్‌గా ఇషాన్ నిలిచాడు. అతడి కంటే ముందు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఉన్నాడు. 2023లో 63 బంతుల్లోనే రోహిత్ శర్మ శతక్కొట్టాడు. కాగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 77 బంతుల్లో సెంచరీ చేసి.. ఈ జాబితాలో మూడో భారత ప్లేయర్‌గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్‌కు లైఫ్‌లైన్.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై దుమారం!
ఫిఫా ప్రపంచ కప్: ఆస్ట్రియా చారిత్రక విజయం