Share News

భారత్‌-అఫ్గాన్ రెండో వన్డే: సెంచరీలతో చెలరేగిన గిల్, ఇషాన్ కిషన్

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:31 PM

లఖ్‌నవూ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. విధ్వంసం సృష్టించింది. 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది.

భారత్‌-అఫ్గాన్ రెండో వన్డే: సెంచరీలతో చెలరేగిన గిల్, ఇషాన్ కిషన్
India vs Afghanistan

ఇంటర్నెట్ డెస్క్: లఖ్‌నవూ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. విధ్వంసం సృష్టించింది. 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. అఫ్గానిస్థాన్‌కు 403 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(154; 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్(125; 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీలతో విజృంభించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 140 బంతుల్లో 224 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.


యశస్వి జైస్వాల్(4) మరోసారి నిరాశపర్చాడు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ(48; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. స్వల్ప స్కోరుకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను.. గిల్, ఇషాన్ కిషన్ గాడీలో పెట్టారు. వారిద్దరూ ఔటయ్యాక ప్లేయర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. శ్రేయస్ అయ్యర్(26), వాషింగ్టన్ సుందర్(19) పర్వాలేదనిపించారు. కేఎల్ రాహుల్(0), గుర్నూర్ బ్రార్(3), అర్ష్‌దీప్ సింగ్(3), ప్రిన్స్ యాదవ్(5) వరుసగా ఔటయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో నంగేయాలియా 4, రషీద్ ఖాన్ 3, ఘజన్‌ఫర్, సలీమ్ సాఫీ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

వైభవ్‌కు లైఫ్‌లైన్.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై దుమారం!

ఫిఫా ప్రపంచ కప్: ఆస్ట్రియా చారిత్రక విజయం

Updated Date - Jun 17 , 2026 | 05:31 PM