Share News

రెండో వన్డే: అఫ్గాన్‌పై ఘన విజయం.. భారత్‌దే సిరీస్

ABN , Publish Date - Jun 17 , 2026 | 09:36 PM

లఖ్‌నవూ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 403 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్.. 44.3 ఓవర్లలో 232/9 స్కోరుకు పరిమితమైంది.

రెండో వన్డే: అఫ్గాన్‌పై ఘన విజయం.. భారత్‌దే సిరీస్
India vs Afghanistan

ఇంటర్నెట్ డెస్క్: లఖ్‌నవూ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 403 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్.. 44.3 ఓవర్లలో 232/9 స్కోరుకు పరిమితమైంది. గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడిన దర్విష్ రసూలీ తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో ఈ మూడు వన్డేల సిరీస్‌ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది. లక్ష్య ఛేదనలో అఫ్గాన్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. రహ్మత్ షా(79), రహ్మనుల్లా గుర్బాజ్(41), సెదిఖుల్లా అటల్(42) రాణించారు. మిగతా బ్యాటర్లంతా తీవ్రంగా విఫలమయ్యారు.


భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, గుర్నూర్ బ్రార్ 3, ప్రిన్స్ యాదవ్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 49. 5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ గిల్(154), ఇషాన్ కిషన్(125) సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ(48) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో నంగేయాలియా 4, రషీద్ ఖాన్ 3, ఘజన్‌ఫర్, సలీమ్ సాఫీ తలొక వికెట్ పడగొట్టారు. అయితే నామమాత్రపు మూడో వన్డే మ్యాచ్ జూన్ 20న చెపాక్ స్టేడియం వేదికగా జరగనుంది.


ఇవి కూడా చదవండి:

శ్రీలంక ప్లేయర్‌తో వివాదం.. వైభవ్‌కు బీసీసీఐ షాక్!

ముక్కోణపు సిరీస్: భారత్-ఎ ఘన విజయం.. ఫైనల్ బెర్తు ఖరారు

Updated Date - Jun 17 , 2026 | 09:36 PM