Home » Assembly elections
చెన్నై నగరంలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో సుమారు 10 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి బూత్‌లోనూ అడ్రస్ మారిన ఓటర్లు 300 మంది వరకు ఉన్నారని గుర్తించడంతో సవరణ పనుల్లో తీవ్ర చిక్కులు ఏర్పడతాయని అధికారులు తెలిపారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన కార్యకర్తలకు క్యూ ఆర్ కోడ్‌తో ఉన్న గుర్తింపు కార్టులను అందజేయాలని ఆ పార్టీ నాయత్వం నిర్ణయించింది. ఈమేరకు 1,02,103 మందికి క్యూ ఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను జిల్లా నేతలకు అందజేశారు.
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి అభ్యర్థులే గెలవాలని, ఆ దిశగా నియోజకవర్గాల ఇన్‌చార్జులు గట్టిగా ప్రయత్నించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు.
‘నవీన్‌యాదవ్‌పై బీఆర్‌ఎస్, నాటి ఎమ్మెల్యే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నిందలు మోపినా భరిస్తూ నిలబడ్డాడు. ఆ ఓర్పు నేటి విజయానికి దోహద పడింది.’ అంటూ యూసుఫ్‌గూడ బస్తీకి చెందిన వజీర్ లచ్చుమమ్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత స్పందించారు.
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మెగా కూటమి ఏర్పాటు చేస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రకటించారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా నేతల సమావేశంలో ఆమె ప్రసంగించారు.
ప్రచారం బాగా చేశాం. కాలికి బలపం కట్టుకున్నట్లుగా ఇంటింటికి తిరిగినం. ఓటర్లకు తాయిలాలు కూడా భారీగానే అందించాం. పోలింగ్ రోజున తమకు ఓట్లు కూడా బాగానే పడ్డాయని ఆశిస్తున్నాం. ఇక మీ దయ.. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండేలా కరుణించండి..’’ అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఇష్టదైవాలను ప్రార్థిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 8.00 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
గడిచిన నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో కపట నాటకాలాడుతున్న దుష్టశక్తుల పాలనకు చరమగీతం పాడనున్నామని, వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశక్తి విలువ తెలియజేస్తామని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్ ధ్వజమెత్తారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యేక చిహ్నం కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ఓడ, విజిల్, ఆటో, క్రికెట్ బ్యాట్ తదితర 10 గుర్తుల్లో ఒకదాన్ని కేయించాల్సిందిగా మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించింది.