Share News

Actor Sharath Kumar: తేల్చి చెప్పేశారు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:32 PM

కొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని నటుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు శరత్‌కుమార్‌ తెలిపారు. అలాగే... తమిళగ వెట్రి కళగం అని పూర్తిగా చెబితే తనకు అర్ధం కావడం లేదని, టీవీకే, ఈవీకే, ఎంవీకే అని చెబితే అర్ధమవుతుందంటూ ఆయన పేర్కొనడం గమనార్హం,

Actor Sharath Kumar: తేల్చి చెప్పేశారు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను

- బీజేపీ నేత శరత్‌కుమార్‌

చెన్నై: రానున్న శాసనసభ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని, తమ అనుచరుల విజయం కోసం ప్రచారం చేస్తానని బీజేపీ జాతీయ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యుడు, నటుడు శరత్‌ కుమార్‌(Actor Sharath Kumar) తెలిపారు. తిరునల్వేలి జిల్లాలో సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 90 శాతం పథకాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు జరుగుతున్నాయని, కానీ, అవి తమ పథకాలుగా డీఎంకే ప్రభుత్వం ప్రచారం చేస్తుందన్నారు. తిరుప్పరంకుండ్రం దీపం వ్యవహారంలో మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు.


nani1.2.jpg

తమిళగ వెట్రి కళగం అని పూర్తిగా చెబితే తనకు అర్ధం కావడం లేదని, టీవీకే, ఈవీకే, ఎంవీకే అని చెబితే అర్ధమవుతుందన్నారు. రాజకీయ పార్టీ ప్రారంభించిన వారు ఎన్నికల్లో పోటీ చేయడం సర్వసాధారణమని, ఆ దిశగా విజయ్‌ పనిచేస్తున్నారన్నారు. అదే సమయంలో టీవీకే అతిపెద్ద పార్టీగా ప్రజలకు భ్రమ కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో పెద్ద పార్టీ బీజేపీ(BJP) కాగా, రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే పెద్ద పారీలు అన్నారు.


nani1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!

ఈశాన్య రుతుపవనాలు బలహీనం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 23 , 2025 | 12:32 PM