Share News

Assembly elections: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం..

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:28 PM

మరికొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సినీ నటీనటులకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజపాళయంలో గౌతమి, మైలాపూరు నుంచి గాయత్రి రఘురామ్‌ పోటీచేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు వారు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Assembly elections: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం..

- రాజపాళయంలో గౌతమి, మైలాపూరు నుంచి గాయత్రి

చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే(DMK, AIADMK) పార్టీల తరఫున పోటీ చేయడానికి సినీ తారలు సిద్ధమవుతున్నారు. ఈ రెండు పార్టీలలోనూ సినీ నటీనటులకు కొదవలేదు. వీరంతా అప్పుడప్పుడూ ప్రచార పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపుతుంటారు. అదే సమయంలో వీరిలో ఒకరిద్దరు ఎన్నికల్లో పోటీకి దిగుతుంటారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తికనబరుస్తున్నవారికి దరఖాస్తుల పంపిణీ జరుగుతోంది.


nani3.2.jpg

ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ప్రముఖ సినీనటి గౌతమి(Goutami), మరో సినీనటి గాయిత్రి రఘురామ్‌(Gayathri Raghuram) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి దరఖాస్తు చేశారు. గౌతమి రాజపాళయంలోనూ, గాయత్రి రఘురామ్‌ మైలాపూరు, శ్రీరంగం నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే విధంగా ఆ పార్టీకి చెందిన మరికొందరు నటీనటులు కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారని ఆ పార్టీవర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి, వెండి ధరలు మరింత పైకి!

కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 19 , 2025 | 12:28 PM