Chennai News: రాష్ట్రంలో.. 97,37,832 ఓటర్ల తొలగింపు
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:10 PM
రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొత్తం ఓటర్ల వివరాలను ప్రటించారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 97,37,832 ఓటర్లను తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు.
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్
చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) తర్వాత విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా నుండి 97,37,832 మందిని తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్(State Chief Electoral Officer Archana Patnaik) పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఉత్తర్వుల మేరకు శుక్రవారం మధ్యా హ్నం 2గంటలకు ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసిన సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...
సర్ పనులు ప్రారంభించక ముందు 6,41,14,587 మంది ఓటర్లుండేవారని, ముసాయిదా ఓటరు జాబిదాలో 5,43,76,755 మంది ఉన్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 97,37,832 మంది ఓటర్లను తొలగించామని, సర్ ఫారాలు తిరిగి సమర్పించని వారు, కొత్తగా ఓటరు జాబితాలో చేరవచ్చన్నారు. ఇందు కోసం బూత్ కమిటీల ద్వారా రెండు వారాల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఓటరు జాబితాలో కొత్తగా చేరదలుచుకున్నవారు శుక్రవారం నుండి జనవరి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
రాష్ట్రంలో..
రాష్ట్రంలో మొత్తం 6కోట్ల41లక్షల 14వేల 587 మంది ఓటర్లలో, 6కోట్ల41లక్షల, 13వేల 773 మందికి దరఖాస్తు ఫారాలు పంపిణీ చేశారు. వాటిలో 6కోట్ల41లక్షల 13వేల 221 ఫారాలు పూర్తిచేసి ఈసీకి సమర్పించారు. ఈ వివరాలతో రూపొందించి విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, కార్పొరేషన్లు, జిల్లా కలెక్టర్ కార్యాలయ వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేసి వీక్షించవచ్చు. మసాయిదా ఓటరు జాబితాలో చిరునామా మారిన వారు ఫారం 8, కొత్తగా చేరదలిచిన వారు ఫారం 6ను పూర్తిచేసి ఈసీ కోరిన ఆధారాలతో సమర్పించి జనవరి 18వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేయించుకోవాలి, ఇక తుది ఓటరు జాబితా ఫిబ్రవరి 17న విడుదలవుతుంది.

కాగా.. తెన్‌కాశి జిల్లాలో 1.51లక్షల మంది, వేలూరు జిల్లాలో 2.15లక్షల మంది, కళ్లకురుచ్చి జిల్లా 2.15లక్షల మంది, తంజావూరు జిల్లా 2.06లక్షల మంది, తిరునల్వేలి జిల్లాలో 2.14లక్షల మంది, మైలాడుదురై జిల్లాలో 75.378 మందిని ఓటరు జాబితా నుండి తొలగించారు. అదే విధంగా రాణిపేట 1.40లక్షల మంది, దిండుగల్‌లో 3.20లక్షల మంది, కరూర్ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో 79,690 మంది, అరియలూరు జిల్లాలో 24,368 మంది ఓటర్లను తొలగించడం గమనార్హం.
గ్రేటర్ చెన్నైలో....
గ్రేటర్ చెన్నైలో 14.25 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లులేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు కొత్తగా ఓటరు జాబితాలో చేరవచ్చని ఈసీ హామీ ఇచ్చింది. నగరంలో ఎస్‌ఐఆర్ ప్రారంభించక ముందు 40,03694 మంది ఓటర్లుండగా, ముసాయిదా ఓటరు జాబితాలో 25,79,676 మంది మాత్రమే ఉండటం గమనార్హం. పాత ఓటరు జాబితాల నుండి 14,20,018 మందిని తొలగించారు. వీరిలో 1.56లక్షల మంది మరణించినవారు కాగా, ఓటరు జాబితాలో ఉన్న చిరునామాలో లేనివారు 27,328 మంది,
అలాగే వలస వెళ్లిన వారు 12,22,164 మంది, రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగివున్న వారు 18,772 మంది అని ఈసీ తెలిపింది. నగరానికి చెందిన ముసాయిదా ఓటరను జాబితాలో 13,31,243 మంది మహిళలున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న కొళత్తూరు నియోజకవర్గంలో 1.03లక్షల మంది ఓటర్లను తొలగించారు. ప్రస్తుతం 1.86లక్షల మంది ఓటు హక్కు కలిగివున్నారు. అలాగే డిప్యూటీ సీఎం ఉదయనిధి నియోజకవర్గం చేపాక్కం-ట్రిప్లికేన్‌లో 89వేల మందిని ఓటరు జాబితా నుండి తొలగించగా, 1.50లక్షల మంది ఓటర్లున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!
బ్యాంకింగ్ వదిలి చాక్లెట్ మేకింగ్
Read Latest Telangana News and National News