Home » Assembly elections
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి 32 సీట్లు కేటాయించేందుకు డీఎంకే నుంచి ప్రతిపాదన వచ్చింది. అయితే 40 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కనీసం 38 సీట్లయినా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు బేరం పెట్టినట్టు చెబుతున్నారు.
ఈ ఏడాది జరుగునున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశాలున్నాయని నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం సంకేతాలు ఇచ్చింది..
మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ బలహీనంగా ఉన్నా ఆ పార్టీనే తమ ప్రత్యర్ధి అని ఆయన అన్నారు.
ఏం డౌట్ అవసరం లేదు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే.. అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ చేసే బాధ్యత కూడా ఎంపీ కనిమొళికి అప్పగించానని తెలిపారు. డీఎంకేకు అధికారం ఖాయం అని ఆయన అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే తరుపున రూపుదిద్దుకోనున్న మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందని ఎంపీ కనిమొళి అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, మహిళలకు హక్కులు, అన్నదాతలకు భద్రత వంటి అంశాలపై మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
కొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని నటుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు శరత్‌కుమార్ తెలిపారు. అలాగే... తమిళగ వెట్రి కళగం అని పూర్తిగా చెబితే తనకు అర్ధం కావడం లేదని, టీవీకే, ఈవీకే, ఎంవీకే అని చెబితే అర్ధమవుతుందంటూ ఆయన పేర్కొనడం గమనార్హం,
ఈ ఏడాది రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒకటి న్యూఢిల్లీ కాగా.. మరొకటి బిహార్. న్యూఢిల్లీలో బీజేపీ గెలిస్తే... బిహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొత్తం ఓటర్ల వివరాలను ప్రటించారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 97,37,832 ఓటర్లను తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌తో ఎవరినీ పోల్చలేమంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. మరికొద్ది రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది.
మరికొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సినీ నటీనటులకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజపాళయంలో గౌతమి, మైలాపూరు నుంచి గాయత్రి రఘురామ్ పోటీచేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు వారు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.