MLA: కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ తెలంగాణకు పూర్వవైభవం
ABN , Publish Date - Sep 09 , 2025 | 10:02 AM
బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ తెలంగాణ పూర్వవైభవం రావాలన్న ఆశతో ఉన్నారని గుర్తు చేశారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.
- బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయండి
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్: బీఆర్‌ఎస్(BRS) పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) పిలుపునిచ్చారు. సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ తెలంగాణ పూర్వవైభవం రావాలన్న ఆశతో ఉన్నారని గుర్తు చేశారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని తెలిపారు.

సమావేశంలో కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ సతీష్ అరోరా, కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్‌గౌడ్, జూపల్లి సత్యనారాయణ, మందడి శ్రీనివాసరావు, మహేశ్వరి, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు, తూము శ్రవణ్ కుమార్, ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవ్, ప్రధాన కార్యదర్శి షరీఫ్ కురేషి, కేపీహెచ్‌బీ డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు అజీముద్దీన్, సయ్యద్ రసూల్, కళ్యాణి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ
Read Latest Telangana News and National News