Chennai News: ఎన్డీయే గెలిస్తే.. నేనే సీఎం
ABN , Publish Date - Sep 06 , 2025 | 10:24 AM
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తేతనను సీఎం పదవిలో కూర్చోబెడతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముందే చెప్పారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో జూలై 7వ తేదీ ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర శుక్రవారం తేని జిల్లా కంబం నియోజకవర్గం చేరుకుంది.
- అమిత్ షా ఎప్పుడో చెప్పారు
- ఎడప్పాడి పళనిస్వామి
చెన్నై: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తేతనను సీఎం పదవిలో కూర్చోబెడతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముందే చెప్పారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో జూలై 7వ తేదీ ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర శుక్రవారం తేని జిల్లా కంబం నియోజకవర్గం చేరుకుంది.
కంబం వారసంత సమీపంలోని ఓ కల్యాణమండపంలో ఉదయం అన్నాడీఎంకే నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఈపీఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలో ఏర్పడిన కూటమిలో బీజేపీ భాగస్వామ్యం పంచుకుందని ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు పలుమార్లు ప్రకటించారని, ఎన్డీయే కూటమి గెలిచినట్లైతే ఈపీఎస్ సీఎం అవుతారని కేంద్రమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారని ఆనందం వ్యక్తంచేశారు. ఈ సమావేశం అనంతరం కంబం జంక్షన్‌లో స్థానిక అన్నాడీఎంకే నేతలు ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఈపీఎస్ పాల్గొని మాట్లాడారు.

ముల్లై పెరియార్ డ్యాం నీటిపై ఆధారపడి ఐదు జిల్లాల ప్రజలు, రైతులు జీవిస్తున్నారని, వర్షాకాలంలో అధికస్థాయిలో నీటిని నిల్వవుంచేలా సుప్రీంకోర్టు ఉత్తర్వులను పొంది డ్యాం ఎత్తును పెంచింది మాజీముఖ్యమంత్రి జయలలిత అనే వాస్తవాన్ని తేని సహా చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రజలు, రైతులు మర్చిపోరన్నారు. 2021లో ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత
Read Latest Telangana News and National News