Share News

TVK Vijay: 13 నుంచి టీవీకే అధినేత విజయ్‌ పర్యటన

ABN , Publish Date - Sep 06 , 2025 | 09:49 AM

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్‌ ఈ నెల 13 నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఆ మేరకు తిరుచ్చి నగరంలో ఆయన ప్రచారం ప్రారంభించనున్నారని పార్టీ నేతలు తెలిపారు. విజయ్‌ పర్యటన కోసం సకల సదుపాయాలతో ఓ లగ్జరీ బస్సు పయనూరులోని ఆయన నివాసం వద్ద సిద్ధంగా ఉందని చెప్పారు.

TVK Vijay: 13 నుంచి టీవీకే అధినేత విజయ్‌ పర్యటన

చెన్నై: తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్‌(Vijay) ఈ నెల 13 నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఆ మేరకు తిరుచ్చి నగరంలో ఆయన ప్రచారం ప్రారంభించనున్నారని పార్టీ నేతలు తెలిపారు. విజయ్‌ పర్యటన కోసం సకల సదుపాయాలతో ఓ లగ్జరీ బస్సు పయనూరులోని ఆయన నివాసం వద్ద సిద్ధంగా ఉందని చెప్పారు. శాసనసభ ఎన్నికలకు ఇక ఎనిమిది నెలలు మాత్రమే ఉండటంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) అన్ని పార్టీల కంటే ముందుగా పర్యటనను ప్రారంభించి ఇప్పటికే వందకు పైగా నియోజకవర్గాలలో ప్రచారం పూర్తి చేశారు.


nani1.2.jpg

పీఎంకే నేత డాక్టర్‌ అన్బుమణి, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(DMDK General Secretary Premalatha) కూడా పర్యటన చేస్తున్నారు. టీవీకే నేత విజయ్‌ ఇటీవలే మదురై నగరంలో పార్టీ ద్వితీయ మహానాడు నిర్వహించి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై పార్టీ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 13, 14 తేదీల్లో విజయ్‌ పర్యటన ప్రారంభించడం ఖాయమని, సమగ్రమైన వివరాలు త్వరలో వెల్లడించనున్నారని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేపు సంపూర్ణ చంద్రగ్రహణం

పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత

Read Latest Telangana News and National News

Updated Date - Sep 06 , 2025 | 09:49 AM