BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:01 AM
కేంద్రప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను డీఎంకే ప్రభుత్వం నీరుగారుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
- కేంద్రప్రభుత్వ పథకాలను నీరుగారుస్తున్న డీఎంకే
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్
చెన్నై: కేంద్రప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను డీఎంకే ప్రభుత్వం నీరుగారుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(Nayanar Nagendran) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిండుగల్ జిల్లా పళని ప్రాంతంలోని ఫుట్‌పాత్ వ్యాపారులు, చిన్నా, మధ్యతరగతి కార్మికులను ఆదుకునేలా కేంద్రప్రభుత్వం పరిచయం చేసిన స్వానిధి, ముద్రా రుణాలు అందజేసేలా దిండుగల్ జిల్లా బీజేపీక కార్యదర్శి పరమేశ్వరిని స్థానిక డీఎంకే పంచాయతీ చైర్మెన్ ఉమా మహేశ్వరి అసభ్య పదజాలంతో ధూషించారని,

దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు. ప్రజలకు లబ్దిచేకూర్చే కేంద్రప్రభుత్వ పథకాలకు ప్రజలనుండి మంచి స్పందన వస్తుండటాన్ని చూసి ఓర్వలేక డీఎంకే ప్రభుత్వం పథకాలను అడ్డుకుంటోందని, మరోవైపు కేంద్రప్రభుత్వ పథకాలకు స్టిక్కర్లు అంటించి తమ పథకాలుగా ప్రకటించుకుంటోందని విమర్శించారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమిలోని పార్టీలన్ని ఏకమై కేంద్రప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నా.. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం వాటిని పట్టించుకోకుండా తమిళనాడు ప్రజలకు లబ్దిచేకూర్చే విధంగా పథకాలు అమలుచేస్తున్నారని, దీనిపై రాష ్ట్రబీజేపీ తరుఫున ప్రచారం చేపట్టనున్నట్లు నయినార్ నాగేంద్రన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం
Read Latest Telangana News and National News