Former CM: మాజీసీఎం ఈపీఎస్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..
ABN , Publish Date - Sep 02 , 2025 | 10:39 AM
‘మక్కళై కాప్పోమ్...తమిళగత్తై మీడ్పోమ్’ (ప్రజలను కాపాడుదాం... రాష్ట్రానికి విముక్తి కల్పిద్దాం...!) పేరుతో తాను చేపట్టిన పర్యటన వంద నియోజకవర్గాల్లో విజయవంతంగా పూర్తయిందని, అన్ని చోట్లా మహిళలు, యువత తనకు ఘనస్వాగతం పలుకుతున్నారని, వీరి స్పందన చూస్తుంటే శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామనే నమ్మకం కలుగుతోందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.
- అడుగడుగునా ప్రజాస్పందన
- మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి
- వంద నియోజకవర్గాల్లో పర్యటన సమాప్తం
చెన్నై: ‘మక్కళై కాప్పోమ్...తమిళగత్తై మీడ్పోమ్’ (ప్రజలను కాపాడుదాం... రాష్ట్రానికి విముక్తి కల్పిద్దాం...!) పేరుతో తాను చేపట్టిన పర్యటన వంద నియోజకవర్గాల్లో విజయవంతంగా పూర్తయిందని, అన్ని చోట్లా మహిళలు, యువత తనకు ఘనస్వాగతం పలుకుతున్నారని, వీరి స్పందన చూస్తుంటే శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామనే నమ్మకం కలుగుతోందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) అన్నారు.
సోమవారం సాయంత్రం మదురై నగరం నుంచి రెండో విడత పర్యటన ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతి నియోజకవర్గంలోనూ తన రోడ్‌షోలకు లక్షలాదిమంది ప్రజలు వస్తుండడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ఇప్పటికి 100 నియోజకవర్గాలలో ప్రచార పర్యటించానని చెప్పారు. జూలై 7న కోవై నియోజకవర్గం వర్గం మేట్టుపాళయంలో తన ప్రచారం ప్రారంభమైందని, ఇటీవలే ఆర్కాడు నియోజకవర్గంలో పర్యటన ముగించానని, దీంతో వంద నియోజకవర్గాల్లో పర్యటన పరిసమాప్తమైందని చెప్పారు.

తన పర్యటన సవ్యంగానే సాగుతోందని, అక్కడక్కడా పాలకపక్షం పర్యటన భగ్నం చేయాలని ప్రయత్నాలు కూడా చేశారని, అన్నాడీఎంకే కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహించడంతో వారి ఆటలు సాగలేదని ఈపీఎస్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువకులంతా అన్నాడీఎంకేపైనే ఆశలు పెట్టుకున్నారని, అధికారంలోకి వస్తే తమకు ఉద్యోగవకాశాలు కలుగుతాయని ఎదురుచూస్తున్నారని, వారి ఆశలను నెరవేర్చటమే తమ ఆశయమన్నారు. అందరికీ నిరాటంకంగా తాగునీరు, విద్యుత్ సరఫరా చేయడం,
పరిశ్రమలు నెలకొల్పడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని, ఈ లక్ష్యాలను డీఎంకే ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా తెలిపారు. రాజకీయపరంగాను, వ్యక్తిగతంగాను తానెవరికీ భయపడనని, ఎలాంటి తప్పులు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదనే తాను భావిస్తానని ఈపీఎస్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News