Home » Assembly elections
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని, దానిని నెరవేర్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం బూత్ లెవల్ కమిటీ సభ్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని, పాయిజన్ డీఎంకేని చిత్తుగా ఓడించడమే తమిళగ వెట్రికళగం (టీవీకే) ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ శపథం చేశారు. మదురై సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన పార్టీ ద్వితీయ మహానాడులో ఆయన ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. తమ పార్టీకి సైద్ధాంతికి శత్రువు బీజేపీ అని, రాజకీయ శత్రువు డీఎంకే అని ప్రకటించారు.
రాజకీయాల్లో అంతగా అనుభవంలేని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ ఉన్నపళంగా అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారని, ప్రజల అండదండలు లేకుండా ఇది ఎప్పటికీ నెరవేరదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు.
వచ్చే యేడాది జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కొత్త పొత్తులు పొడిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగా అన్నాడీఎంకే జాతీయపార్టీ బీజేపీతో అత్యవసరం పొత్తును ఖరారు చేసుకోవడం రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.
అన్నాడీఎంకే ప్రచారసభలోకి ఖాళీ అంబులెన్స్ రావడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మక్కలై కాప్పోం-తమిళగత్తై మీడ్పోం’ నినాదంతో గత నెల 7న ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్రలో భాగం గా సోమవారం రాత్రి వేలూరు సమీపంలోని అనైకట్టు ప్రాంతంలో ఈపీఎస్ రోడ్షో నిర్వహించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని టీవీకే అధ్యక్షుడు, సినీ హీరో విజయ్(Vijay) ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజలతో కలిసిపోయి, వారితో మమేకమైన పార్టీగా వచ్చే ఎన్నికల్లో నిరూపించబోతున్నట్టు విజయ్ వెల్లడించారు.
రాష్ట్రంలో గట్టిగా నిలదొక్కుకోవాలనే ఆకాంక్ష, బలమైన మిత్రపక్షాలు జతకట్టపోవడం, కూటమిలో బోలెడన్ని స్థానాలున్న నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో అధిక స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి 50 చోట్ల పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది.
తమ పార్టీలో పదవులు అనుభవించి, అవసరం తీరాక డీఎంకేలో చేరేవారంతా వలసపక్షులేనని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’అనే నినాదంతో గత నెల 7వ తేదీ కోవై జిల్లా మేట్టుపాళయంలో ప్రారంభిమైన ఈపీఎస్ ప్రచారయాత్ర బుధవారం తిరుపత్తూరుకు చేరుకుంది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్ వెలువడక ముందే ఓటర్ల జాబితాను ఎలాంటి అవకతవకలు లేకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా సవరించాలే తప్ప, బిహార్ తరహా సవరణ చేయకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం డిమాండ్ చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంచర్ల అశోక్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.