Share News

EPS: నో డౌట్.. డీఎంకే నిలిపేసిన పథకాలు మళ్లీ ప్రారంభిస్తాం..

ABN , Publish Date - Sep 11 , 2025 | 01:35 PM

తాము అధికారంలోకి వస్తే డీఎంకే ప్రభుత్వం నిలిపేసిన పథకాలను మళ్లీ ప్రారంభిస్తామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. కోవై జిల్లా పొల్లాచ్చి అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో కుల సంఘాల ప్రతినిధులు, రైతులు, నేత కార్మికులు, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.

EPS: నో డౌట్.. డీఎంకే నిలిపేసిన పథకాలు మళ్లీ ప్రారంభిస్తాం..

- అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి

చెన్నై: తాము అధికారంలోకి వస్తే డీఎంకే ప్రభుత్వం నిలిపేసిన పథకాలను మళ్లీ ప్రారంభిస్తామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ప్రకటించారు. కోవై జిల్లా పొల్లాచ్చి అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో కుల సంఘాల ప్రతినిధులు, రైతులు, నేత కార్మికులు, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు. ఈపీఎస్‌ ప్రసంగానికి ముందుగా ఆయా సంస్థల తరఫున ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు.


ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ... అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కల్లు దుకాణాలు ఎందుకు ప్రారంభించలేదని నిలదీయడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అనంతరం ఈపీఎస్‌ మాట్లాడుతూ... రేషన్‌ దుకాణాల్లో పామాయిల్‌కు బదులు కొబ్బరి నూనె పంపిణీ చేయాలని, కల్లు గీతకు అనుమతించాలని రైతులు కోరుతున్నారని, దీనిపై అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.


nani7.2.jpg

కోవై ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేవన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అమలుపరిచిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాజకీయకక్ష్య కారణంగా డీఎంకే ప్రభుత్వం అటకెక్కించిందని, వాటిని తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రారంభిస్తామని హామి ఇచ్చారు. సభలో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్‌తో పాటు పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.


22న శివగంగలో ధర్నా...

శివగంగ జిల్లా మానామదురై మున్సిపాలిటీ పనితీరుకు నిరసనగా ఈ నెల 22న శివగంగలో అన్నాడీఎంకే తరఫున ధర్నా నిర్వహించనున్నట్లు ఈపీఎస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మానామదురై సిప్కాట్‌ పారిశ్రామికవాడలో రెండేళ్ల క్రితం మెడికేర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సంస్థ మెడికల్‌ బయో వ్యర్ధాలను రీసైక్లింగ్‌ చేసే కర్మాగారాన్ని ప్రారంభించేందుకు యత్నించగా,


స్థానికులు అభ్యంతరం తెలియజేయడంతో నిలిపివేశారు. అయితే, ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం ఆ కర్మాగారానికి అనుమతులు ఇవ్వడంతో పనులు ప్రారంభించారని తెలిపారు. డీఎంకే ప్రభుత్వ తీరును, మున్సిపాలిటీ వైఖరిని ఖండిస్తూ ఈ నెల 22వ తేది ఉదయం మానామదురై తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఈపీఎస్‌ తన ప్రకటనలో తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

పిడుగుపాట్లకు 9 మంది బలి

Read Latest Telangana News and National News

Updated Date - Sep 11 , 2025 | 01:35 PM