BJP State President: ఈపీఎస్ సీఎం అభ్యర్థి అని నేను ఎక్కడా చెప్పలేదు..
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:14 AM
ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎడప్పాడి పళనిస్వామి అని తాను చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా పాళయంకోటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమది జాతీయ పార్టీ అని, పార్టీ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
- అన్నాడీఎంకే ఐక్యతగా ఉండాలి
- బీజేపీ నేత నయినార్ నాగేంద్రన్
చెన్నై: ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎడప్పాడి పళనిస్వామి అని తాను చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నయినార్ నాగేంద్రన్(BJP State President Nayinar Nagendran) స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా పాళయంకోటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమది జాతీయ పార్టీ అని, పార్టీ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఆ ప్రకారం, రాష్ట్ర పార్టీ బూత్ కమిటీ సమావేశానికి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి అని ప్రకటించారని,
అలాగే, ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి పళనిస్వామి అని అమిత్ షా ప్రకటించడంతో, పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని తాము పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్టీఏ కూటమి నుంచి వైదొలిగేందుకు కారణం తానేనని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ చెప్పడం అంగీకరించలేకపోతున్నానన్నారు. ఆయన నాలో ఏ లోపాలు చూసారో అర్ధం కావడం లేదన్నారు. ఈపీఎస్, ఓపీఎస్, దినకరన్ తనకు మంచి స్నేహితులని, వారిలో దినకరన్ ముఖ్యమైన వారన్నారు. గత ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమిలో ఆయన కొనసాగారని, రాబోయే శాసనసభ ఎన్నికల్లోను ఆయన కూటమిలో ఉంటారని భావించామన్నారు.

అన్నాడీఎంకే నుంచి వెళ్లిన వారందరూ తిరిగి ఒక్కటి కావాలన్నదే తన అభిప్రాయమన్నారు. మా కూటమిలో ఇప్పటికే అన్నాడీఎంకే ఉందని, మళ్లీ సెంగోట్టయన్ కూటమిలోకి రావాలని కోరే అవకాశం ఉండదన్నారు. ముఖ్యమంత్రి లండన్, జర్మన్ పర్యటనల్లో ఎన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఏ మేరకు పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అనే విషయమై శ్వేత పత్రం విడుదల చేయాలని నాగేంద్రన్ డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ
Read Latest Telangana News and National News