Share News

EPS: అసెంబ్లీ ఎన్నికల్లో 210 సీట్లు పక్కా..

ABN , Publish Date - Sep 09 , 2025 | 10:35 AM

వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోని కూటమి 210 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు.

EPS: అసెంబ్లీ ఎన్నికల్లో 210 సీట్లు పక్కా..

- విజయంపై ఈపీఎస్‌ ధీమా

చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోని కూటమి 210 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల డీఎంకే అవినీతి, అసమర్థ పాలనపై ప్రజలంతా విసిగిపోయారని, ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించడానికి కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు.


ఓ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ జర్మన్‌, ఇంగ్లాండు దేశాల పర్యటన పూర్తిగా విఫలమైందని, కొత్త పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని, కొత్తగా పెట్టుబడులు కూడా సమీకరించలేదని,, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిశ్రమల విస్తరించేందుకు ఆయా సంస్థలు సిద్ధమవుతుండగా, వాటిని ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 52 మాసాలుగా డీఎంకే ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు,


nani1.2.jpg

సేకరించిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నా స్టాలిన్‌ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకే మధ్యేనని, ఇతర పార్టీలను గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, డీఎంకే పాలనలో రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోని కూటమి 210 అసెంబ్లీ స్థానాలలో విజయబావుటా ఎగురవేయడం తథ్యమని ఈపీఎస్‌ జోస్యం చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 09 , 2025 | 10:35 AM