Tummala: జూబ్లీహిల్స్‌లో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం..
ABN , Publish Date - Sep 12 , 2025 | 08:35 AM
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని, అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్‌లో రూ.5.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని, అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్‌లో రూ.5.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వ హయాంలో పెండింగ్ పనులు అంటూ ఉండవని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు(Rayala Nageswara Rao), అన్వేష్‌రెడ్డి, ఓబెదుల్లా కొత్వాల్, కార్పొరేటర్లు దేదీప్య, సీఎన్ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, దేవిరెడ్డి నాగార్జునరెడ్డి, కాలనీ అధ్యక్షుడు చిలకల వెంకటేశ్వరరావు, కోడె సాంబశివరావు, కోటేశ్వరరావు, హనుమంతరావు యాదవ్, సురేఖ, జీహెచ్‌ఎంసీ జెడ్‌సీ హేమంత్, డీఎంసీ రజనీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News