BJP Annamalai: తేల్చేశారు.. టీవీకేతో బీజేపీ పొత్తుకు నో ఛాన్స్..
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:25 AM
సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో తమ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలే లేవని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. పార్టీపరంగా రెండు మహానాడులు నిర్వహించి జనసమీకరణ చేసినంత మాత్రాన ఆ జనం టీవీకేకు ఓట్లు వేస్తారనే గ్యారెంటీ లేదని, జనాన్ని చూసి విజయ్ మోసపోకూడదన్నారు.
- అన్నామలై
చెన్నై: సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో తమ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలే లేవని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai) స్పష్టం చేశారు. పార్టీపరంగా రెండు మహానాడులు నిర్వహించి జనసమీకరణ చేసినంత మాత్రాన ఆ జనం టీవీకేకు ఓట్లు వేస్తారనే గ్యారెంటీ లేదని, జనాన్ని చూసి విజయ్ మోసపోకూడదన్నారు. ఓ ఆంగ్ల టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధాంతపరంగా బీజేపీ తమ పార్టీకి బద్ధ శత్రువు అని స్పష్టంగా విజయ్(Vijay) ప్రకటించిన తర్వాత తామెలా ఆ పార్టీతో పొత్తుపెట్టుకోగలమని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వానికి చరమగీతం పాడటమే ఎన్డీయే ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే అసెంబ్లీ ఎన్నికల్లోగా బలమైన కూటమిని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ టీవీకేతో బీజేపీ పొత్తుపెట్టుకునే అవకాశాలు లేనేలేవని అన్నామలై స్పష్టం చేశారు.
అన్నాడీఎంకేలో సమస్యలకు డీఎంకే కారణం...

రాష్ట్రంలో అన్నాడీఎంకేలో జరుగుతున్న అన్ని సంఘటనలకు డీఎంకే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ అన్నారు. అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోటయ్యన్ ఆ పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక డీఎంకే ప్రమేయం ఉందన్నారు. ఈ నెల 11న ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ నాయకులను కలుసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతాననని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చివేత
Read Latest Telangana News and National News