Share News

EPS: మీ పార్టీనే వెంటిలేటర్‌పై ఉంది.. ముందు అది చూసుకో..

ABN , Publish Date - Sep 10 , 2025 | 10:40 AM

అన్నాడీఎంకే ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం ఉదయనిధికి కౌంటర్‌ ఇచ్చేలా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్‌(EPS) ఘాటుగా విమర్శించారు. వారి పార్టీ వెంటిలేటర్‌పై ఉందన్న వాస్తవాన్ని గ్రహించకుండా అన్నాడీఎంకే ఐసీయూలో ఉందని ఉదయనిధి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

EPS: మీ పార్టీనే వెంటిలేటర్‌పై ఉంది.. ముందు అది చూసుకో..

- డిప్యూటీ సీఎంకు ఈపీఎస్‌ కౌంటర్‌

చెన్నై: అన్నాడీఎంకే ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి(Deputy CM Udhayanidhi)కి కౌంటర్‌ ఇచ్చేలా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్‌(EPS) ఘాటుగా విమర్శించారు. వారి పార్టీ వెంటిలేటర్‌పై ఉందన్న వాస్తవాన్ని గ్రహించకుండా అన్నాడీఎంకే ఐసీయూలో ఉందని ఉదయనిధి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ నినాదంతో ప్రారంభమైన ఈపీఎస్‌ ప్రచారయాత్ర మంగళవారం రెండోసారి కోవై జిల్లాకు చేరుకుంది.


తొండాముత్తూరు నియోజకవర్గ పరిధిలోని సెల్వపురంలో మాజీ మంత్రి ఎస్పీ వేల్‌మణి, ఎమ్మెల్యే అమ్మన్‌ అర్జునన్‌ ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఈపీఎస్‌ మాట్లాడతూ, డీఎంకే ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకే అన్నాడీఎంకేను స్థాపించిన ఎంజీఆర్‌ ప్రజాధరణతో రాష్ట్రాన్ని 25యేళ్లకు పైగా పరిపాలించి ప్రజలకు అన్ని విధాలా లబ్దిచేకూర్చారని, ఆయన బాటలో పయనించిన మాజీముఖ్యమంత్రి జయలలిత కూడా రాష్ట్రాభివృద్ధికి ఎనలేని కృషిచేశారన్నారు.


nani1.2.jpg

డీఎంకే ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని, అయితే ఈ వాస్తవాన్ని గ్రహించకుండా ఉదయనిధి అన్నాడీఎంకే ఐసీయూలో ఉందని చెబుతున్నారని, నిజానికి వెంటిలేటర్‌లో ఉన్నది డీఎంకేనే అని ఈపీఎస్‌ కౌంటర్‌ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

సీఎం రేవంత్‌ ఇంటి ప్రహరీ కూల్చివేత

Read Latest Telangana News and National News

Updated Date - Sep 10 , 2025 | 10:41 AM