Home » Assembly elections
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం జీహెచ్ఎంసీ యూసుఫ్‌గూడ సర్కిల్-19 కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఈఆర్ఓ, సర్కిల్-19 డీఎంసీ రజనీకాంత్ రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
తన సభలకు కూడా జనం భారీగా హాజరయ్యేవారని బీజేపీ నేత శరత్‌కుమార్ వ్యాఖ్యానించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ప్రచారానికి లక్షలాది మంది తరలిరావడంపై పలు పార్టీల నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం పొందాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎప్పుడూ చెప్పలేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై పేర్కొన్నారు. బుధవారం పెరియార్ జయంతి సందర్భంగా నగరంలోని సిమ్సన్ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
పార్టీ నుంచి బహిష్కృతులైన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), వీకే శశికళను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలోని వివిధ బస్తీల్లో రూ.4.62 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీరు, డ్రైనేజీ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈవీఎం బ్యాలెట్ పేపర్లు మరింత సులువుగా చదివేందుకు వీలుగా ఉండేలా నిబంధనలను ఈసీఐ సవరించింది. తొలిసారి ఈవీఎంలపై గుర్తులతోపాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఉండబోతున్నాయి.
ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అధికారం చేపడితే.. ఢిల్లీ పీఠాన్ని సులువుగా హస్తగతం చేసుకోవచ్చనే ఒక ప్రచారం చాలా కాలంగా ఉంది. మరి కొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కూటమిలో కొత్త పార్టీల చేరిక తదితర అంశాలపై మంగళవారం జరిగిన బీజేపీ చింతనా సమావేశంలో పార్టీ నేతలు సమీక్ష జరిపారు. మహాబలిపురం సమీపంలోని ఓ హాలులో ఏర్పాటైన ఈ సమావేశానికి బీజేపీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీఎల్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రోజుకు రెండు జిల్లాల్లో మాత్రమే ప్రచారం చేయనున్నారు. గతంలో విజయ్ పర్యటన కోసం తయారు చేసిన రూట్‌మ్యా్‌పలో స్వల్పమార్పులు చేపట్టినట్లు ఆ పార్టీ నిర్వాహకులు తెలిపారు.
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు సజావుగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉండాలని నోడల్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు.