Share News

EPS: మా విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు..

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:50 PM

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం, ప్రతిపక్షనేత ఈపీఎస్‌ ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో చేపట్టిన ప్రచారయాత్ర శుక్రవారం కరూర్‌ జిల్లాలోని అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగింది.

EPS: మా విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు..

- ఎడప్పాడి పళనిస్వామి

చెన్నై: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం, ప్రతిపక్షనేత ఈపీఎస్‌ ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో చేపట్టిన ప్రచారయాత్ర శుక్రవారం కరూర్‌ జిల్లాలోని అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగింది. కరూర్‌ వేలుస్వామి మఠం జంక్షన్‌లో జరిగిన రోడ్‌షోలో ఈపీఎస్‌(EPS) మాట్లాడుతూ..


తన ప్రచార సభకు పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలను చూస్తుంటే అప్పుడే ఎన్నికల్లో గెలిచినంత ఆనందంగా ఉందన్నారు. ఈ సభ ప్రతిపక్షాలను తప్పకుండా వణికిస్తుందని, 2026లో జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలో ఏర్పడే కూటమి అధికార పీఠమెక్కుతుందని, దీనిని ఏ శక్తి అడ్డుకోలేదని ఆయన ధీమా వ్యక్తంచేశారు. నట చక్రవర్తి శివాజీ గణేశన్‌ కంటే అవినీతి మంత్రిగా న్యాయస్థానం చేత చివాట్లు తిన్న సెంథిల్‌బాలాజీ బాగా నటిస్తారని,


nani3.2.jpg

ఆయన ఎన్నికల సమయంలో ఓటర్లకు నగదు, నగలు పంపిణీ చేసి గెలవడం అలవాటుగా మార్చుకున్నారని విమర్శించారు. కొత్త పథకాల పేరుతో డీఎంకే పాలకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, కరూర్‌లో తాజాగా డిప్యూటీ సీఎం ఉదయనిధి ప్రారంభించిన బస్‌స్టేషన్‌ నిర్మాణంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, దీంతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈపీఎస్‌ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..

ట్రిపుల్‌ ఆర్‌ బాధితుల ఆరోపణలు నిజమే

Read Latest Telangana News and National News

Updated Date - Sep 27 , 2025 | 12:50 PM