Home » Asia Cup
ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో హాంకాంగ్‌పై శ్రీలంక విజయం సాధించి టోర్నీలో ఉత్కంఠను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో నాలుగు జట్లు యుఏఈ, నేపాల్, ఒమాన్, మలేసియా డూ ఆర్ డై దశకు చేరాయి.
ప్రత్యర్థి టీమ్‌తో కరచాలనం చేయాలన్నది కేవలం సుహృద్భావ చర్య మాత్రమేనని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. షేక్ ఇవ్వాలన్న నిబంధన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో పీసీసీ అభ్యంతరాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో బీసీసీఐ తొలిసారిగా ఈ మేరకు స్పందించింది.
ఆసియా కప్‌లో హ్యాండ్‌షేక్ వివాదానికి కేంద్రంగా మారిన మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ పట్టుబడుతోంది. ఇందుకు ఐసీసీ అంగీకరించే అవకాశాలు తక్కువని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నిన్నటి ఆసియా కప్ మ్యాచ్‌లో భారత క్రీడాకారులు పాక్ టీమ్ సభ్యులతో కరచాలనం చేయకపోవడంపై పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది.
ఛేదనలో భాగంగా మొదట్లో తడబడ్డ భారత ఆటగాళ్లు క్రమంగా ఆటపై పట్టుబిగిస్తూ ముందుకు సాగుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.
భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఆదిలోనే బుమ్రా, పాండ్యా తమ ప్రతాపం చూపించడంతో పాక్ తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది.
ఇండియా-పాకిస్థాన్ 2025 ఆసియా క్రికెట్ మ్యాచ్ కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. టీవీలు పగలకొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాక్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా సభ్యులు తమ చేతులకు నల్లటి బ్యాండ్స్ ధరించి నిరసన తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే భారత్‌లో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
చాలా నెలల తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం జరగనున్న మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ విషయంలో భారత ఆటగాళ్లు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు.
ఆసియా కప్ 2025లో నేటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రేజీ క్లాష్ ఎక్కడ లైవ్‌లో చూడాలి, ఎప్పుడు మొదలవుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.