BCCI Defends No Handshake: తప్పేమీ చేయలేదు.. షేక్ హ్యాండ్ కాంట్రవర్సీపై తొలిసారిగా స్పందించిన బీసీసీఐ
ABN , Publish Date - Sep 16 , 2025 | 09:08 AM
ప్రత్యర్థి టీమ్‌తో కరచాలనం చేయాలన్నది కేవలం సుహృద్భావ చర్య మాత్రమేనని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. షేక్ ఇవ్వాలన్న నిబంధన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో పీసీసీ అభ్యంతరాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో బీసీసీఐ తొలిసారిగా ఈ మేరకు స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ మ్యాచ్‌లో భారత క్రీడాకారులు పాక్ క్రికెటర్లతో కరచాలనం చేయకపోవడం వివాదంగా మారిన నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి జట్టు సభ్యులతో కరచాలనం చేయాలన్న తప్పనిసరి నిబంధన ఏదీ లేదని స్పష్టం చేశారు. అది కేవలం ఆనవాయితీగా వస్తున్న సుహృద్భావ చర్య మాత్రమేనని అన్నారు (BCCI on handshake row).
‘మీరు రూల్ బుక్ కనుక చూస్తే.. ప్రత్యర్థి జట్టుతో కరచాలనంపై ఎలాంటి నిబంధన ఉండదు. అది కేవలం జట్ల మధ్య సుహృద్భావ చర్య మాత్రమే. ఆనవాయితీగా భావించొచ్చు. కరచాలనం చేయాలన్నది ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడల్లో అనుసరించే చట్టం ఏమీ కాదు. మరి ఇలా ప్రత్యేక చట్టం ఏదీ లేనప్పుడు భారత క్రికెటర్లు పాక్ క్రీడాకారులతో కరచాలనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. పాక్‌తో ఉద్రిక్తతల నడుమ షేక్ హ్యాండ్ చేయాల్సిన అవసరం లేదు’ అని సదరు అధికారి పేర్కొన్నారు (India Pakistan no handshake).
అయితే, పాక్ మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. కరచాలనం వదన్న భారత క్రీడాకారుల అభిమతాన్ని పాక్ జట్టుకు తెలియజేసి మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలని పేర్కొంది. ఆయనపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. యాండీని తొలగించాలని ఐసీసీని కోరింది. ఆయన తీరు ఐసీసీ నిబంధనలకు, క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది. తమ డిమాండ్స్ నెరవేరకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని కూడా హెచ్చరించింది (rules on handshakes cricket).
ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సభ్యులు పాక్ క్రీడాకారులకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు ముభావంగా ఉన్నారు. మ్యాచ్ గెలిచిన తరువాత కూడా భారత ప్లేయర్లు పాక్ క్రికెటర్లతో చేయి కలపలేదు. మౌనంగా మైదానాన్ని వీడాక తమలో తామే సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి