Share News

PCB protest no handshake: షేక్ హ్యాండివ్వని భారత క్రీడాకారులు.. ఫిర్యాదుకు సిద్ధమైన పీసీబీ

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:05 AM

నిన్నటి ఆసియా కప్ మ్యాచ్‌లో భారత క్రీడాకారులు పాక్ టీమ్ సభ్యులతో కరచాలనం చేయకపోవడంపై పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది.

PCB protest no handshake: షేక్ హ్యాండివ్వని భారత క్రీడాకారులు.. ఫిర్యాదుకు సిద్ధమైన పీసీబీ
PCB protest no handshake

ఇంటర్నెట్ డెస్క్: నిన్నటి మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లతో టీమిండియా సభ్యులు కరచాలనం చేయకపోవడంతో మొదలై వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఈ విషయంలో భారత్‌పై ఫిర్యాదు చేసేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు పీసీబీ అధికారికంగా ఓ ప్రకటన కూడా విడుదల చేసింది (PCB protest no handshake).

పహల్గాం దాడి నేపథ్యంలో నిన్న దుబాయ్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్ జరిగింది. అయితే, టాస్ మొదలు మ్యాచ్ ముగింపు వరకూ టీమిండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లను మాటవరుసకైనా పలకరించలేదు. కరచాలనం కూడా చేయలేదు. టాస్ సందర్భంలో సూర్యకుమార్, పాక్ కెప్టెన్ కరచాలనం చేసుకోలేదు. మ్యాచ్ ముగిసిన తరువాత కూడా భారత జట్టు ఆటగాళ్లు సైలెంట్‌గా మైదానాన్ని వీడారు (India snub handshake Pakistan).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, టాస్ సమయంలో షేక్ హ్యాండ్‌కు సంబంధించి టీమిండియా ముందే తమ నిర్ణయాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ద్వారా పాక్ జట్టుకు చేరవేసిందట. భారత ఆటగాళ్లతో కరచాలనానికి ప్రయత్నించొద్దని, భారత కెప్టెన్ సూర్యకుమార్‌ను సమీపించేందుకు ట్రై చేయొద్దని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు మ్యాచ్ రిఫరీ ముందే సూచనలు చేశారు. ఇక డ్రెస్సింగ్‌ రూమ్‌లో భారత్ ఆటగాళ్లతో స్నేహ పూర్వక సంభాషణ కోసం పాక్ ప్రయత్నించినా తలుపులు తెరుచుకోలేదు (Asia Cup 2025 sportsmanship row).


ఈ విషయాన్ని పీసీబీ ధ్రువీకరించింది. పాక్ కెప్టెన్‌కు రిఫరీ స్పష్టమైన సూచనలు చేశారని పేర్కొంది. అయితే, ఈ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, ఈ విషయంలో తాము అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ చర్యలకు ప్రతిగా పాక్ కెప్టెన్ సల్మాన్.. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదని కూడా పీసీబీ తెలిపింది. భారత్ తీరుకు నిరసనగానే పాక్ కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది.

ఇక ఈ అంశంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ కూడా ఇప్పటికే స్పందించారు. తన వైఖరిని స్పష్టం చేశారు. పాక్‌కు తగిన విధంగా జవాబిచ్చామని అన్నారు. ఈ విజయం పహల్గాం బాధితులకు అంకితమిస్తున్నామని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్

పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 11:22 AM