Asia Cup Ind Vs Pak: ఆసియా కప్ భారత్ పాక్ మ్యాచ్.. ఉత్కంఠగా సాగుతున్న దాయాదుల పోరు
ABN , Publish Date - Sep 14 , 2025 | 07:45 PM
భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఆదిలోనే బుమ్రా, పాండ్యా తమ ప్రతాపం చూపించడంతో పాక్ తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో పాక్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. 16 ఓవర్లు ముగిసేసరికి పాక్ ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 83 పరుగులకే పరిమితమైంది. పదమూడవ ఓవర్‌లో కుల్‌దీప్ వరుసగా రెండు వికెట్లు తీసి పాక్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. పదమూడవ ఓవర్‌లో హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్ వరుసగా వెనుదిరిగారు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో (9.6) సల్మాన్ ఆఘా (3) అభిషేక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు అక్షర్ పటేల్ ఫకర్ జమాన్‌ను కూడా పెవిలియన్ బాట పట్టించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ తొలి ఓవర్లలోనే కీలక వికెట్ల కోల్పోయిన ఆచితూచి ఆడటం ప్రారంభించింది. పాక్ తన వికెట్లు కాపాడుకునే ప్రయత్నంలో ఉండటంతో రన్ రేట్ భారీగా తగ్గింది. మ్యాచ్ ప్రారంభంలో హార్దిక్ పాండ్యా తొలి బంతికే సయీమ్ అయూబ్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తరువాత బుమ్రా బౌలింగ్‌లో మహ్మద్ హ్యారిస్ మూడు పరుగులకే వెనుదిరిగాడు (India vs Pakistan Asia Cup 2025).
భారత్ జట్టు:
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
పాకిస్తాన్ జట్టు:
సాహిబ్‌జాదా ఫర్హాన్, సయిమ్ అయూబ్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), ఫకర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిదీ, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్
ఇవి కూడా చదవండి
పాక్‌తో మ్యాచ్.. నల్ల బ్యాండ్స్ ధరించి నిరసన తెలపనున్న టీమిండియా?
నేటి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ ఎక్కడొస్తుంది.. ఎలా చూడాలంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి