Share News

Asia Cup Ind Vs Pak 2025: ఆసియా కప్ పాక్‌తో మ్యాచ్.. 10 ఓవర్లకు భారత్ స్కోరు ఎంతంటే..

ABN , Publish Date - Sep 14 , 2025 | 10:44 PM

ఛేదనలో భాగంగా మొదట్లో తడబడ్డ భారత ఆటగాళ్లు క్రమంగా ఆటపై పట్టుబిగిస్తూ ముందుకు సాగుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.

Asia Cup Ind Vs Pak 2025: ఆసియా కప్ పాక్‌తో మ్యాచ్.. 10 ఓవర్లకు భారత్ స్కోరు ఎంతంటే..
Asia Cup Ind Score after 10 overs

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ పాక్‌ను 127 పరుగుల స్వల్ప స్కోరుకు పరిమితం చేసింది. అనంతరం ఛేదన దిగిన టీమిండియా పది ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి పరుగులు 88 చేసింది (Ind Vs Pak Asia Cup).

మొదట్లో తడబడ్డా ఆ తరువాత కోలుకున్న భారత్ ఆ తరువాత నిలకడగా ఆట కొనసాగించింది. తొలుత హారిస్ బౌలింగ్‌లో (1.6) శుభమన్ గిల్ పది పరుగులకే స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, అభిషేక్ శర్మ మాత్రం మరో ఎండ్‌ లో దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ సయిమ్ అయూబ్ నాలుగో ఓవర్‌లోనే అభిషేక్ శర్మ స్పీడుకు బ్రేకులు వేశాడు. అతడి బౌలింగ్‌లో (3.4) అభిషేక్ శర్మ(31) అష్రఫ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత భారత బ్యాటర్లు తిలక్ వర్మ (28), సూర్యకుమార్ (17) నిలకడగా ఆటను కొనసాగించడంతో పది ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 88 పరుగులుగా ఉంది.

Updated Date - Sep 14 , 2025 | 10:51 PM