Suryakumar Yadav insulted: పాక్ మాజీ క్రికెటర్ అసభ్యకర భాష.. సూర్యకుమార్ యాదవ్‌పై తీవ్ర విమర్శ..
ABN , Publish Date - Sep 16 , 2025 | 08:03 PM
ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు వ్యవహరించిన తీరును పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ ఆటగాళ్లతో టీమిండియా కెప్టెన్, ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్‌తో సహా, ఆ దేశ మాజీ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు వ్యవహరించిన తీరును పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ ఆటగాళ్లతో టీమిండియా కెప్టెన్, ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్‌తో సహా, ఆ దేశ మాజీ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ (Mohammad Yousuf) టీమిండియా ఆటగాళ్లను విమర్శించడంలో అథమ స్థాయికి దిగజారాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను నీచంగా అభివర్ణించాడు (India vs Pakistan cricket).
పాకిస్థాన్ టెలివిజన్ సమా టీవీలో జరిగిన ఓ చర్చా కార్యక్రమానికి (live TV controversy) హాజరైన మహ్మద్ యూసఫ్.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను 'పంది' అని సంభోదించాడు. షాకైన యాంకర్ యూసఫ్‌ను సరిదిద్దేందుకు ప్రయత్నించినా అతడి తీరు మాత్రం మారలేదు. 'భారతదేశం తమ సినిమా ప్రపంచం నుంచి బయటకు రాలేకపోతోంది. అంపైర్లు, మ్యాచ్ రిఫరీ ద్వారా పాకిస్థాన్‌ను హింసించి వారు గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు భారతదేశం సిగ్గుపడాలి' అని యూసఫ్ అన్నాడు.
ఆ తర్వాత సూర్యకుమార్‌ను యూసఫ్ 'పంది' అని పిలవడం ప్రారంభించాడు (Suryakumar Yadav insulted). యాంకర్ వారించేందుకు ప్రయత్నించినా యూసఫ్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. పలుసార్లు సూర్యకుమార్‌ను అలాగే పిలిచాడు. యూసఫ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహ్మద్ యూసఫ్ 1998 నుంచి 2010 మధ్య పాకిస్థాన్ తరపున 288 వన్డేలు, 90 టెస్ట్‌లు మరియు 3 టీ20లు ఆడాడు.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి