Asia Cup 2025 Sri Lanka: హాంకాంగ్‌పై శ్రీలంక విజయం..ఈ 4 జట్లకు డూ ఆర్ డై పరిస్థితి
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:37 PM
ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో హాంకాంగ్‌పై శ్రీలంక విజయం సాధించి టోర్నీలో ఉత్కంఠను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో నాలుగు జట్లు యుఏఈ, నేపాల్, ఒమాన్, మలేసియా డూ ఆర్ డై దశకు చేరాయి.
ఆసియా కప్ 2025(Asia Cup 2025)లో నిన్న జరిగిన మ్యాచులో శ్రీలంక (Sri Lanka) జట్టు హాంకాంగ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అంత ఈజీగా కొనసాగలేదు. 150 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రీలంక జట్టు ఆటగాళ్లు తడబడ్డారు. ఈ సందర్భంగా శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తమ జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, టోర్నమెంట్‌లో మరింత మెరుగ్గా ఆడాలని ఆటగాళ్లను కోరారు.
అసలంక ఆవేదన
ఈ విజయం తమకు ఉపశమనం కలిగించినప్పటికీ, జట్టు ప్రదర్శనలో లోపాలు కనిపించాయని మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక అన్నారు. ముఖ్యంగా బౌలింగ్‌లో మొదటి మూడు ఓవర్లలో జట్టు చాలా బలహీనంగా కనిపించిందని, 16వ ఓవర్‌లో కీలక వికెట్లు కోల్పోవడం తప్పిదమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న ఫార్మాట్‌లో ఇలాంటి తప్పులు జరగవచ్చు, కానీ ఇవి పదేపదే జరగకూడదని అసలంక హెచ్చరించారు. జట్టు తమ ప్రదర్శనను సమీక్షించుకోవాలని, మరింత మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆయన ఆటగాళ్లకు సూచించారు. మరోవైపు హాంగ్‌కాంగ్ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూనే, శ్రీలంక బౌలర్లు మొదటి మూడు ఓవర్లలో చాలా దారుణంగా బౌలింగ్ చేశారని విమర్శించారు.
హాంకాంగ్ కెప్టెన్
హాంకాంగ్ (Hong Kong) కెప్టెన్ యాసిమ్ ముర్తజా తమ జట్టు పోరాటాన్ని ప్రశంసిస్తూనే, కీలక సమయంలో చేజారిన క్యాచ్‌లు తమ ఓటమికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. మేం 150-160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం, అది సాధించాం. కానీ ఫీల్డింగ్‌లో చేజారిన క్యాచ్‌లు మాకు చాలా దెబ్బతీశాయని ఆయన వెల్లడించారు.
సూపర్ ఫోర్‌కు 2 జట్లు
ప్రస్తుతం సూపర్ ఫోర్ దశకు ఇండియా, శ్రీలంక జట్లు చేరాయి. ఇక తర్వాత జరగనున్న పాకిస్తాన్, యూఏఈ.. నాకౌట్ మ్యాచ్. దీనిలో ఎవరు గెలుస్తారో వారు సూపర్ ఫోర్‌కు వెళతారు. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి తప్పుకుంటుంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే నెట్ రన్ రేట్ ఆధారంగా పాకిస్తాన్ జట్టు ముందుకు వెళ్తుంది. అంటే యూఏఈ తప్పక గెలవాల్సిందే.
బంగ్లాదేశ్ vs అఫ్గానిస్తాన్ మ్యాచులో కూడా బంగ్లాదేశ్ తప్పక గెలవాలి. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అఫ్గానిస్తాన్‌కు ఇంకా శ్రీలంకతో ఒక మ్యాచ్ మిగిలి ఉంది. అఫ్గానిస్తాన్ మ్యాచ్ గెలిస్తే, బంగ్లాదేశ్ కంటే ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. అఫ్గానిస్తాన్ రెండు మ్యాచులు ఓడితే అప్పుడు నెట్ రన్ రేట్ ప్రకారం బంగ్లాదేశ్‌కు అవకాశం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి