India US Trade Talks: నేడు భారత్, అమెరికా వాణిజ్య చర్చలు..సుంకాల ఒప్పందం కుదిరేనా
ABN , Publish Date - Sep 16 , 2025 | 10:42 AM
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఈరోజు మళ్లీ ప్రారంభం కానున్నాయి. న్యూఢిల్లీలో జరిగే ఈ చర్చలు ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు, వాణిజ్య సంబంధాలను తిరిగి బలోపేతం చేయాలనే లక్ష్యంగా జరగనున్నాయి.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (India US Trade Talks) గురించి ఈరోజు మళ్లీ చర్చలు జరగనున్నాయి. ఈ సారి న్యూఢిల్లీలో మంగళవారం రోజంతా దీనిపై చర్చ జరగనుంది. అమెరికా భారత వస్తువులపై 50 శాతం దిగుమతి సుంకాలు (Import Tariffs) విధించిన తర్వాత ఈ సమావేశం కీలకంగా మారింది.
ఏం జరుగుతోంది?
అమెరికా నుంచి బ్రెండన్ లించ్ ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇతను సౌత్ ఆసియా, సెంట్రల్ ఆసియాలో 15 దేశాలతో అమెరికా వాణిజ్య విధానాలను చూసుకుంటారు. భారత్ తరపున సీనియర్ కామర్స్ మినిస్ట్రీ అధికారి రాజేష్ అగర్వాల్ పాల్గొంటున్నారు. ఇవి ఆరో రౌండ్ చర్చలు కాదు, కానీ భారత్-అమెరికా మధ్య ఒప్పందం ఎలా కుదుర్చుకోవచ్చో చూడటానికి ఒక ముఖ్యమైన సమావేశమని అగర్వాల్ సోమవారం అన్నారు.
గతంలో చర్చలు
గతంలో ఇరు దేశాల మధ్య ఐదు రౌండ్‌ల చర్చలు జరిగాయి. ఆరో రౌండ్ ఆగస్ట్ 25-29 మధ్య జరగాల్సి ఉండగా, అమెరికా సుంకాల విధానం కారణంగా అది వాయిదా పడింది. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల గురించి పాజిటివ్‌గా మాట్లాడారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు.
మోదీ ఈ చర్చలు రెండు దేశాల మధ్య అపారమైన అవకాశాలను తెరవగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా ట్రంప్ విధానాల వల్ల కొంత టెన్షన్ నడిచినా, ఇప్పుడు రిలేషన్స్ కాస్త స్మూత్ అవుతున్నాయి. ట్రంప్ రెండోసారి మోదీని పొగడటం, బాండింగ్‌ను స్ట్రాంగ్ చేయాలని చెప్పడం చూస్తే, రెండు దేశాలూ కీలక ఒప్పందం కోసం ఆసక్తిగా ఉన్నాయని అర్థమవుతోంది.
ఎందుకు ఈ గొడవ?
అమెరికా భారత్ నుంచి వచ్చే వస్తువులపై 50 శాతం సుంకాలు విధించింది. అందులో 25 శాతం సుంకం మనం రష్యా నుంచి కొనే చమురు వల్ల వచ్చింది. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల్లో విధించిన అత్యధిక సుంకాల్లో ఒకటి. భారత్ ఈ చర్యను అన్యాయం, అసమంజసమని విమర్శించింది. రష్యా నుంచి చమురు కొనడం వెనుక మన దేశ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని భారత్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి