Share News

Tirupati: స్కామర్‌కు షాకిచ్చిన శానిటేషన్ వర్కర్.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN , Publish Date - Sep 16 , 2025 | 10:44 AM

ఎంత చదువుకున్నా.. ఎంత పరిజ్ఞానమున్నా సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మేవాళ్లే ఎక్కువ. వాళ్ల ఉచ్చులోపడి లబోదిబోమనే వాళ్లే. కానీ, తిరుపతికి చెందిన శానిటేషన్‌ వర్కర్‌ ఒకరు మాత్రం మీ వేషాలు నా దగ్గర కాదంటూ సోమవారం తనకు ఫోనుచేసిన అమ్మాయికి దీటుగా ఎదురు తిరిగారు.

Tirupati: స్కామర్‌కు షాకిచ్చిన శానిటేషన్ వర్కర్.. ఏం జరిగిందో తెలిస్తే..

- సైబర్‌ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కని శానిటేషన్‌ వర్కర్‌

తిరుపతి: ఎంత చదువుకున్నా.. ఎంత పరిజ్ఞానమున్నా సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మేవాళ్లే ఎక్కువ. వాళ్ల ఉచ్చులోపడి లబోదిబోమనే వాళ్లే. కానీ, తిరుపతి(Tirupati)కి చెందిన శానిటేషన్‌ వర్కర్‌ ఒకరు మాత్రం మీ వేషాలు నా దగ్గర కాదంటూ సోమవారం తనకు ఫోనుచేసిన అమ్మాయికి దీటుగా ఎదురు తిరిగారు. వివరాలిలా ఉన్నాయి. తిరుపతికి చెందిన దొరరాజు మధుసూదనరాజు టీటీడీ పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన శానిటేషన్‌ వర్కర్‌గా పనిచేస్తున్నారు.


ఈయనకు 87459 85232 నెంబరు నుంచి వాట్సాప్‌ ఫోను వచ్చింది. వాట్సాప్‌ పిక్‌గా ‘స్కాలర్‌షిప్‌ డిపార్టుమెంటు’ అని ఉంది. మీ కుమారుడు రోహిత్‌ కుమార్‌ రాజుకు ప్రభుత్వం స్కాలర్‌ షిప్‌ కింద రూ.38,500 మంజూరు చేసిందంటూ ఓ యువతి చెప్పింది. మీకు ఫోనుపే ద్వారా జమ చేశామంటూ స్ర్కీన్‌ షాట్‌ పెట్టింది. స్ర్కీన్‌ షాట్‌లో ఆ మొత్తం జమ చేసినట్లుగా ఉంది. దీనికిగాను తమకు కమీషను కింద వెంటనే డబ్బు పంపాలని తొందర చేసింది.


nani2.2.jpg

నీ అకౌంటులో రూ.మూడు వేలు ఉంది కదా.. దానిని పంపండని ఆమె ఒత్తిడి తెచ్చింది. ఈయన మాత్రం తన తన అకౌంటులో బ్యాలెన్సు చెక్‌ చేయగా, జమ కాలేదని తెలిసింది. మీరు డబ్బు పంపండి.. మళ్ళీ స్కాలర్‌ షిప్‌ అమౌంటుతో కలిపి మీకు పంపుతామంటూ ఆమె చెప్పినా ఆయన గట్టిగా నిలదీశారు. దీంతో ఆమె ఫోను స్విచ్‌ ఆఫ్‌ చేసింది. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం సీఐ వినోద్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం

మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్‌

ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 16 , 2025 | 11:37 AM