Home » Asia Cup
ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అసమాన పోరాటంతో పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి విజయ కేతనం ఎగురవేసింది. ఈ టోర్నీలో భారత్ చేతిలో వరుసగా మూడు సార్లు పాకిస్థాన్ ఓడిపోయింది.
ఆసియా కప్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒకే టోర్నీలో పాకిస్థాన్‌ను మూడు సార్లు ఓడించింది. తొమ్మిదోసారి ఆసియా కప్ చేజిక్కించుకుంది. అయితే మ్యాచ్ అనంతరం దుబాయ్ మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది.
మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తనదైన సెలబ్రేషన్‌తో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుకు గట్టి రిటార్ట్ ఇచ్చాడు
దుబాయ్‌లో రాత్రి జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన అనంతరం ట్రోఫీని తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించి సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రోఫీని పాకిస్తాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండంతో..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్-2025 చివరి రోజు రానే వచ్చింది. ఈరోజు దుబాయ్ వేదికగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. భారత్- పాకిస్థాన్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. సాధారణంగా క్రికెట్ అంటేనే పిచ్చెక్కే అభిమానులు.. భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటిది.. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు గ్రౌండ్ లోకి దిగాయి. ఈ మ్యాచ్‌కి సంబంధించిన బాల్ టు బాల్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి..
పాక్ 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మిడిల్ ఓవర్స్‌లో తీవ్రంగా తడబడి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
పాక్ పటిష్ఠ స్థితిలో కనిపిస్తోంది. పది ఓవర్లు ముగిసేసరికి పాక్ ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు.
ఆసియా కప్ ఫైనల్స్ పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
పాక్‌ను లైట్ తీసుకోవద్దని భారత్‌ను ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ హెచ్చరించారు. ఫైనల్స్‌లో పాక్ తన సర్వశక్తులు ఒడ్డి పోరాడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. అలసత్వాన్ని భారత్ దరిచేరనివ్వొద్దని అన్నారు.
ఆసియా కప్‌లో అసలు సిసలు రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ ప్రారంభమైన నాటి నుంచి ఒక్కసారి కూడా కూడా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడలేదు. గత 40 ఏళ్లలో ఒక్కసారి కూడా భారత్, పాక్ జట్లు కలిసి ఫైనల్‌కు చేరుకోలేదు.