Asia Cup drama: అసలైన ట్రోఫీలు నా దగ్గరే ఉన్నాయి.. చరిత్రలో ఇదే తొలిసారేమో: సూర్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:36 AM
ఆసియా కప్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒకే టోర్నీలో పాకిస్థాన్‌ను మూడు సార్లు ఓడించింది. తొమ్మిదోసారి ఆసియా కప్ చేజిక్కించుకుంది. అయితే మ్యాచ్ అనంతరం దుబాయ్ మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది.
ఆసియా కప్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒకే టోర్నీలో పాకిస్థాన్‌ను మూడు సార్లు ఓడించింది. తొమ్మిదోసారి ఆసియా కప్ చేజిక్కించుకుంది. అయితే మ్యాచ్ అనంతరం దుబాయ్ మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ హెడ్ అయిన పీసీబీ చీఫ్ మొహ్సీన్ నఖ్వీ చేతుల మీదుగా విజేత అయిన టీమిండియా ట్రోఫీ తీసుకోవాలి. అయితే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది (India denied trophy).
తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించడంతో మైదానం నుంచి నఖ్వీ వెళ్లిపోయారు (Asia Cup news). వెళ్లిపోతూ తనతో పాటు ఆసియా కప్ ట్రోఫీని, టీమిండియా ఆటగాళ్లకు ఇవ్వాల్సిన పతకాలను కూడా పట్టుకెళ్లిపోయారు. నఖ్వీ తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఈ ఘటనపై స్పందించాడు. 'ఒక టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు ట్రోఫీ అందుకోకపోవడం నేనిప్పటివరకు చూడలేదు. మేం దీనిని చాలా కష్టపడి సాధించాం. ట్రోఫీ లేకపోయినా మేం ఛాంపియన్లం అని అందరికీ తెలుసు. అయినా డ్రెస్సింగ్ రూమ్‌లో మొత్తం 14 ట్రోఫీలు నాతోనే ఉన్నాయి. సహచర ఆటగాళ్లే నా రియల్ ట్రోఫీలు' అని సూర్య పేర్కొన్నాడు ( PCB vs BCCI)
'నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవద్దని మాకు ఎవరి నుంచీ ఆదేశాలు రాలేదు (Suryakumar statement). మైదానంలో మేమే ఆ నిర్ణయం తీసుకున్నాం. విజేతలుగా నిలిచన తర్వాత సంబరాలు చేసుకునేందుకు మేం గంటన్నర పాటు ఎదురుచూశాం. ట్రోఫీ అందుకోలేకపోయినా మాకేం బాధగా లేదు. ఈ టోర్నీ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. చాలా సంతోషంగా తిరిగి వెళ్తున్నాం. ఆసియా కప్‌లో ఇప్పటివరకు నాకు వచ్చిన మ్యాచ్ ఫీజును భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నా' అంటూ సూర్య పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి
ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..
బుమ్రా జెట్ సెలబ్రేషన్స్.. రవూఫ్‌పై సూపర్ రివేంజ్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి