Bumrah jet celebration: బుమ్రా జెట్ సెలబ్రేషన్స్.. రవూఫ్‌పై సూపర్ రివేంజ్..
ABN , Publish Date - Sep 29 , 2025 | 07:21 AM
మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తనదైన సెలబ్రేషన్‌తో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుకు గట్టి రిటార్ట్ ఇచ్చాడు
మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తనదైన సెలబ్రేషన్‌తో ఆకట్టుకున్నాడు (India vs Pakistan). గత మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుకు గట్టి రిటార్ట్ ఇచ్చాడు. గత మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌరల్ హరిస్ రవూఫ్ (Haris Rauf) మైదానంలో వివాదాస్పద సంజ్ఞలతో టీమిండియా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. 6-0 అంటూ తన చేతులతో చూపించి రెచ్చగొట్టాడు.
గత మ్యాచ్‌లో వివాదాస్పదంగా ప్రవర్తించిన రవూఫ్‌పై తాజా మ్యాచ్‌లో బుమ్రా పగ తీర్చుకున్నాడు. బుమ్రా వేసిన అద్భుతమైన యార్కర్‌కు రవూఫ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం బుమ్రా కూల్‌గానే జెట్ సెలబ్రేషన్స్ (jet celebration) చేసుకున్నాడు. ఇండియన్ రాఫెల్ జెట్ ఫైటర్స్ పాకిస్థాన్ ఎయిర్ బేస్‌ను ధ్వంసం చేసి సురక్షితంగా తిరిగి వచ్చినట్టు తన చేతితో చూపించాడు. దీంతో బుమ్రా సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుమ్రాపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (Tilak Varma) అసమాన పోరాటంతో పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి విజయ కేతనం ఎగురవేసింది. ఈ టోర్నీలో భారత్ చేతిలో వరుసగా మూడు సార్లు పాకిస్థాన్ ఓడిపోయింది. అయితే మ్యాచ్ ఫలితం అనంతరం మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. దీంతో ట్రోఫీ లేకుండానే టీమిండియా ఆటగాళ్లు వెనుదిరిగారు.
ఇవి కూడా చదవండి
ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి