Ind Vs Pak: వన్ వికెట్ డౌన్.. పది ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు ఇదీ
ABN , Publish Date - Sep 28 , 2025 | 09:03 PM
పాక్ పటిష్ఠ స్థితిలో కనిపిస్తోంది. పది ఓవర్లు ముగిసేసరికి పాక్ ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ను దీటుగా ఎదుర్కొంటామని చెప్పిన పాక్ మెల్లగా భారత్‌పై ఒత్తిడి పెంచుతోంది. టాస్ ఓడిన దయాది దేశం బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. ఓపెనర్ సాహిబ్‌జాదా బ్యాట్ ఝళిపించడంతో పాక్ పది ఓవర్లు ముగిసేసరికి పటిష్ఠ స్థితికి చేరుకుంది. హాఫ్ సెంచరీ సాధించి పెవిలియన్ బాట పట్టిన సాహిబ్‌జాదా ఫర్హాన్ జట్టుకు మాత్రం శుభారంభాన్ని ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి వేసిన బంతిలో (9.4) తిలక్‌కు క్యాచ్ ఇచ్చిన ఫర్హాన్ వెనుదిరిగాడు.
మరో ఎండ్‌లో జమాన్(25) నిలకడగా ఆడుతుండటంతో 10 ఓవర్లు ముగిసేసరికి పాక్ 87 పరుగులు చేయగలిగింది. భారీ స్కోరు దిశగా పాక్ వెళుతున్న నేపథ్యంలో భారత్ తక్షణం వికెట్లు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో, ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది (Ind Vs Pak Asia Cup).