Share News

Rinku Singh: రింకూ సింగ్ అప్పుడు చెప్పాడు.. ఇప్పుడు చేసి చూపించాడు.. ఆసక్తికర విషయం వెల్లడించిన సంజన

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:36 PM

తాజా ఆసియా కప్‌లో రింకూ సింగ్ ఒకే ఒక బాల్ ఆడాడు. కేవలం ఒక్క బంతి మాత్రమే ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ బౌండరీ బాది టీమిండియాకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

Rinku Singh: రింకూ సింగ్ అప్పుడు చెప్పాడు.. ఇప్పుడు చేసి చూపించాడు.. ఆసక్తికర విషయం వెల్లడించిన సంజన
Rinku Singh

తాజా ఆసియా కప్‌లో (Asia Cup 2025) రింకూ సింగ్ ఒకే ఒక బాల్ ఆడాడు. కేవలం ఒక్క బంతి మాత్రమే ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ బౌండరీ బాది టీమిండియాకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. తాజా టోర్నీలో రింకూకు మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. ఫైనల్ మ్యాచ్ సమయానికి హార్దిక్ గాయపడడంతో అతడి స్థానంలో రింకూ తుదిజట్టులో స్థానం దక్కించుకున్నాడు (India wins Asia Cup).


ఈ మ్యాచ్‌కు సంబంధించి వ్యాఖ్యాత సంజనా గణేశన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆసియా కప్ సెప్టెంబర్ 9న మొదలైంది. అంతకు మూడు రోజుల ముందే 6వ తేదీన రింకూ ఓ పేపర్ మీద రాసిన విషయాన్ని సంజన చూపించింది. ఫైనల్‌లో విన్నింగ్ రన్స్ తానే చేస్తానంటూ ఓ పేపర్ మీద రింకూ రాసినట్టు చూపించింది. ముందుగా అనుకున్నట్టుగానే రింకూ అలా చేశాడని సంజన పేర్కొంది. అలాగే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గురించి కూడా సంజన మాట్లాడింది.


తాజా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో తిలక్ వర్మ విలువైన ఇన్నింగ్స్ ఆడతాడని ముందే ఊహించి పేపర్ మీద రాసిన విషయాన్ని సంజన తెలియజేసింది. 147 పరుగుల ఛేదనలో 3 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో తిలక్ వర్మ (69 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబె (33), సంజు శాంసన్ (24)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.


ఇవి కూడా చదవండి

ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..

బుమ్రా జెట్ సెలబ్రేషన్స్.. రవూఫ్‌పై సూపర్ రివేంజ్..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 12:36 PM