Ind Vs Pak Asia Cup: మిడిల్ ఓవర్స్‌లో చతికిలపడ్డ పాక్.. భారత్ లక్ష్యం ఎంతంటే..
ABN , Publish Date - Sep 28 , 2025 | 09:50 PM
పాక్ 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మిడిల్ ఓవర్స్‌లో తీవ్రంగా తడబడి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
ఇంటర్నెట్ డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ తొలి పది ఓవర్లు ముగిసే సరికి పటిష్ఠ స్థితికి చేరుకున్నా మిడిల్ ఓవర్లలో తీవ్ర తడబాటుకు లోనైంది. చివరకు 146 పరుగుల పరిమిత స్కోరుకే ఇన్నింగ్స్ ముగించింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా, ఫకార్‌లు వెనుదిరగడంతో పాక్ పతనం ప్రారంభమైంది. ఆ తరువాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో చిక్కుల్లో పడిపోయింది (Pak Innings Ends Ind Target 147 Runs). దీంతో, భారత్‌కు147 పరుగుల స్వల్ప లక్ష్యం మిగిలింది.
సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను (57) వరుణ చక్రవర్తి పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తరువాత బరిలోకి దిగిన సైమ్ అయూబ్ (14) కుల్‌దీప్ వేసిన ఓవర్లో (12.5) బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ (13.3 ఓవర్‌లో) మహ్మద్ హ్యారిస్‌ను డకౌట్ చేశాడు. ఫర్హాన్ తరువాత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన ఫకార్ జమాన్ (46) వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో (14.3) కుల్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో, కీలక బ్యాట్స్‌మన్‌లను కోల్పోయిన పాక్ చిక్కుల్లో పడిపోయింది. అక్షర్ పటేల్ వేసిన ఓవర్‌లో (15.3) హుస్సేన్ తలాత్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత కెప్టెన్ సల్మాన్ ఆఘా (8,16.1 ఓవర్‌లో), షాహీన్ అఫ్రీదీ (0, 16.4 ఓవర్‌లో ఎల్‌బీడబ్ల్యూ) వెనుదిరిగారు.
17వ ఓవర్ చివరి బంతికి కుల్‌దీప్ ఫహీమ్ అష్రఫ్‌ను డకౌట్‌గా వెనుదిరిగాడు కుల్‌దీప్ వేసిన 17వ ఓవర్‌లో ఏకంగా మూడు వికెట్లు సమర్పించుకున్న పాక్ మళ్లీ కోలుకోలేని స్థితికి చేరుకుంది. ఒకానొక దశలో ఐదు ఓవర్లకు పాక్ ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయిందంటే మిడిల్ ఓవర్స్ పాక్‌కు ఎంత క్లిష్టంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. ఇక బుమ్రా వేసిన బంతిలో (17.5) హారిస్ రవూఫ్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరకు 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ ఏకంగా 4 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. పాక్ జట్టులో ఫర్హాన్ (57), ఫకార్ (46), సైమ్ (14) మాత్రమే రెండంకెల పరుగులు చేయగలిగారు.