Home » AP Politics
మాజీ మంత్రి అనిల్ కుమార్‌పై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అనిల్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు చేరారు. మజ్జి శ్రీనివాసరావుతోపాటు ఆయన కుమార్తె సిరి సహస్ర పసుపు కండువా కప్పుకున్నారు.
విజయనగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శీను) రాజీనామా చేశారు.
తమ పార్టీ నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని... ఈ విషయంపై సీరియస్‌గా ఉండాలని ఆదేశించారు.
గొడ్డలి పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో చేసిన అభివృద్ధి-సంక్షేమం గురించి చెప్పుకోవాలి... గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చిన పేరు, ప్రతిష్ఠలను తట్టుకోలేక వైసీపీ స్వార్థ రాజకీయాలకు తెరతీసిందని ధ్వజమెత్తారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
పార్టీయే సుప్రీం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీ పదవుల్లో ఉన్న వారిని మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా గౌరవించాల్సిందేనని ఆదేశించారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చని తెలిపారు.
రాజకీయాల్లో కొత్త నాయకత్వ విధానానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతోంది. ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రతినిధులకు నాయకత్వ పటిమ పెంపొందించే అంశంపై రెండు రోజుల ట్రైనింగ్ కాంక్లేవ్‌ను టీడీపీ నిర్వహిస్తోంది.