Share News

జగన్‌ విధ్వంసం దిద్దుబాట!

ABN , Publish Date - Aug 01 , 2026 | 08:08 AM

రాష్ట్రంలో 2019-24 కాలంలో వైసీపీ ప్రభుత్వం సాగించిన ప్రాజెక్టుల విధ్వంసాన్ని సరిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్‌ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన ఎత్తిపోతల పథకాలను తిరిగి గాడినపెట్టనున్నారు.

జగన్‌ విధ్వంసం దిద్దుబాట!
Irrigation Projects

  • రూ.4360 కోట్లతో 12 ఎత్తిపోతల నిర్మాణం

అమరావతి, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2019-24 కాలంలో వైసీపీ ప్రభుత్వం సాగించిన ప్రాజెక్టుల విధ్వంసాన్ని సరిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్‌ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన ఎత్తిపోతల పథకాలను తిరిగి గాడినపెట్టనున్నారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు.. ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయడం వల్ల తక్కువ వ్యయంతోనే స్థానికంగా నీటివనరులను నింపేందుకు ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నారు. అందుకే వాటిని పునరుద్ధరించాలని ఇటీవల జరిగిన జలవనరుల శాఖ సమీక్షలో అధికారులను ఆదేశించారు. దరిమిలా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 12 ఎత్తిపోతల పథకాలను రూ.4360.24 కోట్లతో నిర్మించేందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వు జారీ చేశారు.


వీటిలో ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం జల్లేరువాగు కుడివైపున రూ.44.84 కోట్లతో ఎత్తిపోతల.. ఎన్టీఆర్‌ జిల్లాలో రూ.209.90 కోట్లతో కేతవీరునిపాడు, గుత్తావారిపాలెం ఎత్తిపోతలు.. ప్రకాశం జిల్లాలో పాలేరు నదిపై రూ.274 కోట్లతో తక్కెళ్లపాడు వద్ల.. అనంతపురం జిల్లా బొమ్మనహళ్లి హగరి నదిపై రూ.22.53 కోట్లతో హరేసముద్రంపైన.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో రూ.50 కోట్లతో పెద్దచిగుళ్లరావు వద్ద.. కర్నూలు జిల్లా పాములపాడులో రూ.99.90 కోట్లతో శ్రీశైలం కుడి ప్రధాన కాలువపై ఇస్కల ఎత్తిపోతల.. ప్రకాశం జిల్లా వేటపాలెం వద్ద రూ.547 కోట్లతో పందిళ్లపల్లి లిఫ్ట్‌.. రూ.935 కోట్లతో బాపట్ల జిల్లా అద్దంకి మండలం ఉప్పలపాడు వద్ద.. విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం వద్ద రూ.133 కోట్లతో పెద్దేరు నదిపైన.. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం కనకలకోడు కాలువపై 111 కోట్లతో కరకుదురు వద్ద... ఇదే జిల్లా కొంగోడు ఎత్తిపోతల (రూ.135 కోట్లు).. పల్నాడు జిల్లా దుర్గి మండలం బుగ్గవాగుపై రూ.1797.32 కోట్లతో ధర్మవరం ఎత్తిపోతల ఉన్నాయి.

Updated Date - Aug 01 , 2026 | 08:08 AM