Home » AP Politics
ఎన్టీఆర్ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని తెలిపారు. త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టంచేశారు.
మాజీ సీఎం జగన్ ఎక్కడ పర్యటన వెళ్లినా.. ఆ పర్యటన ఓ వివాదంగా మారుతోంది. తాజాగా ఆయన నిన్న చేసిన నెల్లూరు పర్యటనలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారంటూ.. పలువురి వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అమరావతి : టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పులివెందుల టీడీపీ నేత పార్థసారథి రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ నేతలు పల్లా శ్రీనివాస్, వర్ల రామయ్య, కొనకళ్ళ నారాయణలకు పార్థసారథి వివరణ ఇచ్చారు.
గత ఐదేళ్లు గుడ్డులా పొదుగులో దాక్కున నేతలు అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియని నేతలు కూడా నేడు రాష్ట్ర అభివృద్ధిపై చీకటి రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా... ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డంగా పడి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారని ధ్వజమెత్తారు.
ఐదేళ్ల విధ్వంస పాలనతో జగన్ వేలకోట్ల దోపిడీ చేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడు జగన్ అండ్ కో శ్రీరంగ నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. సీబీఐ ఈడీ క్రిమినల్ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ప్రజాస్వామ్యం అంటూ నీతి సూత్రాలు చెబుతున్న జగన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కక తప్పదని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు.
రైతులు, ప్రజలు, వ్యాపారుల సంక్షేమ కోసం సీఎం చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. అట్టడుగులో ఉన్న ఏపీని ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టండని ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్‌లో పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. సింగపూర్ తో ఏపీకి మూడు దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన భూములపై వైసీపీ పెద్దలు కన్నువేశారని పూర్ణచంద్రరావు ఆరోపించారు.
ఏపీలో అనేక ప్రాంతాల్లో డెన్‌లు ఏర్పాటుచేసి జగన్ అండ్ కో వేలకోట్లు దాచుకున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూ.200 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అండ్ కో చేసిన లిక్కర్ స్కాం రూ. 3500 కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ అక్రమాలు బయటకు వస్తాయనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిబంధనలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. చిన్న పథకానికి ఇన్ని కొర్రీలు ఎందుకు? అంటూ ప్రశ్నించారు.