Home » AP Police
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనిల్ చోకరాని సిట్ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఏపీకి తీసుకువచ్చి ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
తిరుపతి పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అయితే ఆయన మృతిపై సోదరుడు శ్రీహరి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మదనపల్లిలో కిడ్నీ రాకెట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతిచెందడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారిస్తున్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఎన్డీపీఎస్ యాక్ట్ కఠినంగా అమలు చేస్తున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. డ్రగ్స్‌పై ఏపీలో నిఘా పెరిగిందని.. కఠినతరమైన శిక్షలు, చట్టాలు ఉన్నాయని హెచ్చరించారు.
వైసీపీ హయాంలోని ఐదేళ్ల నిర్లక్ష్యం వల్ల తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి ఆరోపించారు. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో కేతిరెడ్డి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే తప్పేముందని జేసీ అస్మిత్‌రెడ్డి నిలదీశారు.
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధమున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నందిగామలో వైసీపీ చేపట్టే ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తన వివరాలను సిట్ బృందం అడగటంపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సుబ్బారెడ్డి.
వీఆర్‌లో ఉన్న పోలీస్ అధికారులకు జీతాలు రావడం లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో పిల్ వేశారు. ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్‌పై బుధవారం చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది.