Home » AP Police
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సత్తెనపల్లిలోని ని రెంటపాళ్లలో జగన్ ఈనెల 18వ తేదీన పర్యటించారు. ఈ సమయంలో జగన్ కారు కిందపడి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతిచెందాడు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్పై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకరంగా పోస్టులు పెట్టారు.
డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈగల్ చీఫ్, ఐజీ రవికృష్ణ ఉద్ఘాటించారు. గంజాయి, ఏండీఏంఏ డ్రగ్స్ వాడుతున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నామని ఐజీ రవికృష్ణ హెచ్చరించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జగన్ వాహనం కింద ఓ వ్యక్తి పడిన ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దయ, జాలి లేకుండా అతడ్ని ముళ్ల పొదల్లో పడేశారని హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏవోబీ కమిటీ సీనియర్ నాయకురాలు వెంకటరవి చైతన్య అలియాస్ అరుణ, కమిటీ మెంబరు అంజూ అలియాస్ మాసే మృతి చెందినట్టు ఎస్పీ అమిత్ బర్దార్ ధ్రువీకరించారు.
మావోయిస్ట్ కీలక నేతలు గాజుల రవి అలియాస్ ఉదయ్, వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ, అంజు అలియాస్ మాసే.. ఈ ముగ్గురు పోలీస్ కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఘటనపై అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వివరాలు వెల్లడించారు.
మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులపై ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ గన్ మ్యాన్ మదన్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు.
కానిస్టేబుళ్లపై వేధింపుల అంశంపై ఎక్సైజ్ శాఖ మౌనం దాల్చింది. శాఖలోని ఓ కీలక అధికారి కొన్ని నెలలుగా ఆరుగురు కానిస్టేబుళ్లను ఇంటి పనులకు వినియోగించుకుంటున్న విషయాన్ని మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది.
సైబర్ నేరగాళ్లు రైతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ ద్వారా వచ్చే నకిలీ ఏపీకే ఫైళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవద్దు అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సూచించారు.
వ్యాపారం పేరుతో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన దంపతులు ఘరానా మోసానికి తెరదీశారు. మధు గ్రూప్స్ పేరుతో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ వ్యాపారమని, పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ పెట్టారు.