Share News

AP liquor case: లిక్కర్ కేసు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిట్..

ABN , Publish Date - Aug 13 , 2025 | 02:45 PM

హైదరాబాద్‌లో లిక్కర్ కేసులో భాగంగా సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై తనకు అనుమానాలు ఉన్నాయని రాజ్ కసిరెడ్డి కోర్టులో వాదించారు. రూ.11 కోట్ల విషయంలో.. ఆధారాలు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు

AP liquor case: లిక్కర్ కేసు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిట్..
Raj KasiReddy

విజయవాడ: ఏపీ లిక్కర్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా.. ఇవాళ(బుధవారం) లిక్కర్ కేసులోని 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టులో రాజ్‌ కసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులపై విమర్శలతో విరుచుకుపడ్డారు.


హైదరాబాద్‌లో లిక్కర్ కేసులో భాగంగా సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై తనకు అనుమానాలు ఉన్నాయని రాజ్ కసిరెడ్డి కోర్టులో వాదించారు. అధికారులు రూ.11 కోట్ల విషయంలో.. ఆధారాలు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. కాల్ డేటా రికార్డ్స్‌ను స్వచ్ఛంద సంస్థతో విచారణ జరిపితే.. అసలు విషయం బయటకు వస్తాయని కోర్టుకు విన్నవించుకున్నారు. సీబీఐ, సిట్ కలిసి ఆధారాలను ధ్వంసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.


అయితే గతంలో కూడా సిట్ అధికారులపై రాజ్‌ కసిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు బెయిల్‌ రాకుండా అడ్డుకునేందుకు సిట్‌ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఎక్కడెక్కడో పట్టుకున్న డబ్బును తనకు లింక్‌ చేసి కట్టుకథలు అల్లుతోందన్నారు. సిట్‌ స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో రాజ్ కసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి

అభిమానిని తోసేసిన జయా బచ్చన్.. దెబ్బకు జడుసుకున్నాడు..

30 ఏళ్ల స్నేహం.. ఫ్రెండ్ భార్యతో ఎఫైర్ పెట్టుకుని

Updated Date - Aug 13 , 2025 | 02:46 PM