Home » AP Police
విజయవాడ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. భారీగా మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలోని ఎలైట్ ఫోర్సెస్ అయిన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండోలు జాతీయ స్థాయిలో మరోసారి తమ సత్తా చాటుకున్నారు. హర్యానా రాష్ట్రం మనేసర్‌లోని క్యాంపస్‌లో నిర్వహించిన 16వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీల్లో ఏపీ బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది.
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెచ్చెరువు సమీపంలో ఇవాళ(శుక్రవారం) అగ్నిప్రమాదం జరిగింది. అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటవీ సంపద కళ్లముందే కాలిపోయింది.
మండలకేంద్రంలో గంజాయి సిగరెట్ రూ.250కి విక్రయిస్తున్నారు. విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. యువతను టార్గెట్‌గా చేసుకొని గంజా సిగరెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వాటిని తాగిన యువకులు మత్తులో తూలుతున్నారు.
చిత్తూరు జిల్లాలోని పలమనేరు శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటనపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మరో సోదరుడు అడబాల వీరబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రకాశం జిల్లా టంగుటూరులోని ఓ పొగాకు కంపెనీలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగాకు బేళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 వేలకు పైగా పొగాకు బేళ్లు దగ్ధమయ్యాయి.
సురక్షిత బాల్యంతోనే సుస్థిర భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ఏపీ వ్యాప్తంగా 'ఆపరేషన్ చిన్నారి తల్లి' ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు తెలిపారు.
మచిలీపట్నం చిలకలపూడి సర్కార్ తోట ప్రాంతంలో ఉపాధ్యాయురాలు మార్క్‌రేట్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 50 తులాలు బంగారం, రూ.140,000 నగదును దుండగులు చోరీ చేశారు.
ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇవాళ(బుధవారం) ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సునీల్ నాయక్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.