Share News

Former MP Ranjith Reddy: మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:48 PM

DSR కంపెనీ ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారలు తెలిపారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, SR నగర్, సురారంలో సోదాలు కొనసాగుతున్నాయి.

Former MP Ranjith Reddy: మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..
EX MP Ranjith Reddy

హైదరాబాద్: మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రంజిత్ ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. DSR గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలో భాగస్వామ్యం ఉన్నందునే తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రంజిత్ రెడ్డితోపాటు DSR ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈవో సత్యనారాయణ రెడ్డిల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.


DSR కంపెనీ ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారలు తెలిపారు. జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ , SR నగర్ , సురారంలో సోదాలు కొనసాగుతున్నాయి. CRPF బలగాల మధ్య సోదాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే DSR గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి సంబంధించి తెలంగాణ, కర్ణాటకలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏకకాలంలో 30 చోట్ల సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


ఫిలింనగర్‌లో నిర్మిస్తున్న DSR ప్రాజెక్ట్‌పై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. DSR The World ప్రాజెక్ట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన అధికారులు. 14.45 ఎకరాలలో 9టవర్లు, 344 యూనిట్స్‌తో భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న DSR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్కో ప్లాట్ రూ. 12 కోట్లు నుండి రూ. 15 కోట్లుకు అమ్మకాలు చేస్తున్నట్లు తేల్చిన అధికారులు. DSR కంపెనీ ఇప్పటి వరకు 34 బడా ప్రాజెక్ట్‌లు నిర్మించినట్లు గుర్తించిన ఐటీ. ఈ మేరకు సోదాల్లో వందల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

విద్యుత్‌ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి

ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?

Updated Date - Aug 19 , 2025 | 01:54 PM