Share News

Cyber Attack In Minister Narayana Family: సైబర్ నేరగాళ్లకు చిక్కిన టీడీపీ మంత్రి అల్లుడు..

ABN , Publish Date - Aug 23 , 2025 | 11:36 AM

పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌ను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. పునీత్ కంపెనీలో సైబర్ మోసానికి పాల్పడ్డారు. పునీత్‌ పేరుతో తన అకౌంటెంట్‌కు సైబర్‌ కేటుగాళ్ల మెసేజ్‌ చేశారు. అత్యవసరంగా రూ.1.40 కోట్లు కావాలంటూ.. అకౌంట్‌కు డబ్బులు పంపుమని మెసేజ్ పంపారు.

Cyber Attack In Minister Narayana Family: సైబర్ నేరగాళ్లకు చిక్కిన టీడీపీ మంత్రి అల్లుడు..

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు, పోలీసులు ఎన్నిచర్యలు తీసుకున్న సైబర్ నేరాలు మాత్రం ఆగడం లేదు. రోజుకో కొత్త పద్ధతిలో పేద, ధనిక అని తేడా లేకుండా అందరి నుంచి డబ్బులు కాజేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటూ.. ఎవరికి తెలియకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. అధికారులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించడంలో విఫలం అవుతున్నారని చెప్పవచ్చు. ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ఈ సైబర్ నేరాలకు గురవుతునే ఉన్నారు. తాజాగా ఓ మంత్రి అల్లుడు సైబర్ నేరాగాళ్ల చేతికి చిక్కాడు.


పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌ను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. పునీత్ కంపెనీలో సైబర్ మోసానికి పాల్పడ్డారు. పునీత్‌ పేరుతో తన అకౌంటెంట్‌కు సైబర్‌ కేటుగాళ్లు మెసేజ్‌ చేశారు. అత్యవసరంగా రూ.1.40 కోట్లు కావాలంటూ.. అకౌంట్‌కు డబ్బులు పంపుమని మెసేజ్ పంపారు. నిజంగానే పునీత్ మెసేజ్ చేశారనుకున్న అకౌంటెంట్‌, కేటుగాళ్ల అకౌంట్‌కు డబ్బులు పంపించాడు. కొద్ది సేపటి తరువాత మోసపోయినట్లు గ్రహించిన అకౌంటెంట్‌ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సైబర్ నేరగాళ్లను ట్రేస్‌ చేసి పట్టుకున్నారు. యూపీకి చెందిన సంజీవ్‌, అరవింద్‌ అనే వ్యక్తులు సైబర్ నేరానికి పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.


ఇవీ చదవండి..

స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్‌ కేసులో విశాఖ వైద్యుడు

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2025 | 11:37 AM