Lady Chor: విశాఖలో లేడీ దొంగ హల్చల్.. కంట్లో కారం కొట్టి చోరీ..
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:06 PM
విద్యా రంగంలో కావచ్చు.. స్పోర్ట్స్‌లో కావచ్చు.. బిజినెస్‌లో కావచ్చు మేము ఏం తక్కువ కాదు అంటూ వారి ఉనికి చాటుకుంటున్నారు. మగవాళ్ళకు సమానంగా పనులు చేస్తూ.. దేనిలోనూ ఆడవారు తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు.
విశాఖ: ప్రస్తుత సమాజంలో.. ఏ పనిలో అయిన మగవాళ్ళకు ధీటుగా ఆడవారు తయారవుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. విద్యా రంగంలో కావచ్చు.. స్పోర్ట్స్‌లో కావచ్చు.. బిజినెస్‌లో కావచ్చు మేము ఏం తక్కువ కాదు అంటూ వారి ఉనికి చాటుకుంటున్నారు. మగవాళ్ళకు సమానంగా పనులు చేస్తూ.. దేనిలోనూ ఆడవారు తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. అయితే తాజాగా ఓ లేడీ కూడా మగవారితో పోటీ పడింది. పోటీ పడితే తప్పేంటి అంటారా... పోటీ పడింది.. చదువులోనో.. ఆటల్లోనో కాద్ అండి.. దొంగ తనంలో. అవును దొంగ తనంలో.. మగ దొంగలకు పొటీ ఇద్దామనుకుందో ఏమో.. మగ దొంగల మాదిరిగా నేరాలకు ఒడిగడుతోంది.
విశాఖలో లేడీ దొంగ రెచ్చిపోయింది. లాసెన్స్ బే కాలనీలో ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్న మహిళ కంట్లో కారం కొట్టి.. చేతికి ఉన్న బంగారు గాజులను లాక్కెళ్లింది. స్థానికులు పట్టుకుందామని ప్రయత్నం చేసిన వారి చేతికి చిక్కకుండా.. పరారయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. పలు చోట్ల ఈ లేడీ దొంగ నేరాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...
‘కన్ఫర్డ్’లుగా 17 మంది సిఫారసు!
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తీసేయండి