Home » AP Police
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఓ యువ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ప్రేమించిన యువతి తనను నిరాకరించిందనే మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
పది నెలల బాలుడు కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పదినెలల బాలుడిని కిడ్నాప్ చేసి విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.
అగ్నిప్రమాదాలు, వాటి నివారణ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులది ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన అని ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భార్గవ్ రెడ్డిపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు ఈరోజు (శుక్రవారం) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పూడి శ్రీహరి, గిరీశ్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శుభకార్యం కాస్తా భయాందోళనల మధ్య ముగిసింది. తన పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఎంతో ఉత్సాహంగా ఉన్న పెళ్లికొడుకుపై ఓ వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోతున్న వారికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు, కొన్ని గ్రూప్‌లు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థకు (CBI) ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
బెట్టింగ్,జూద కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఏపీలో ఆన్‌లైన్ గేమింగ్ పేరిట జరుగుతున్న బెట్టింగ్, జూద కార్యకలాపాలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.